వైయస్‌ జగన్‌ పేరు వింటే బాబుకు వణుకు

కర్నూలు: ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ పేరు వింటేనే చంద్రబాబు వెన్నులో వణుకుపడుతోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్‌ బాధితులు నానా అవస్థలు పడుతుంటే వారిని ఆదుకోకపోగా, అగ్రిగోల్డ్‌ సంస్థ ఆస్తులను కొట్టేసేందుకు చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో అగ్రిగోల్డ్‌ బాధితుల ఆత్మహత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయన్నారు. అయినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం బాధాకరమన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. దయచేసి ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, వైయస్‌ జగన్‌ అండగా ఉంటారన్నారు. నాలుగున్నరేళ్లుగా మొద్దునిద్రపోతున్న చంద్రబాబు సర్కార్‌ ఎన్నికలు ఇంకా రెండు నెలలు ఉన్నాయనగా ప్రజలపై కపట ప్రేమ వలకబోస్తుందని మండిపడ్డారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయని ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ ప్రకటించిన పథకాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారన్నారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు.

Back to Top