బీసీలకు చంద్రబాబు అన్యాయం..

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన  కార్యదర్శి కారుమూరి నాగేశ్వరరావు..

ఏలూరు:భారతదేశ చరిత్రలో ఏడాదిన్నర కాలంలో బీసీ అధ్యయన కమిటీ వేసిన పార్టీ వైయస్‌ఆర్‌సీపీ మాత్రమేనని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ఏలూరులో మహాత్మా జ్యోతిబా పూలే ప్రాంగణం( బీసీ గర్జన సభా)  ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గ్రామగ్రామాన అధ్యయన కమిటీ పర్యటించి బీసీల స్థితిగతులను తెలుసుకుందన్నారు.బీసీలకు న్యాయం చేయాలని క్షుణ్ణంగా అధ్యయనం చేశారన్నారు.బాబు పాలనలో బీసీల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కమిటీ నివేదిక అద్దం పట్టిందన్నారు.చంద్రబాబు..బీసీలను అడ్డంపెట్టుకుని వారి భూజాలపై  పదవులను అనుభవిస్తూ వారిని కిందకు తొక్కే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.దివంగత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి తప్ప ఏ పార్టీలు బీసీలకు న్యాయం చేయలేదన్నారు. నేడు వైయస్‌ఆర్‌ తనయుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రెండు అడుగులు ముందుకు వేసి రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేయాలనే సంకల్పంతో గొప్ప నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు.బీసీలను అడ్డం పెట్టుకుని..చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టారన్నారు.  మాకు న్యాయం చేయాలని కుల వృత్తుల వారు కోరితే..తమాషాలు చేస్తున్నారా..తోలు తీస్తాను..తోక కత్తిరిస్తాను అంటూ చంద్రబాబు దుర్భాషలాడారని గుర్తుచేశారు.

Back to Top