చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు...

వైయస్‌ఆర్‌సీపీ సానుభూతి పరుల ఓట్ల తొలగింపు అన్యాయం..

రాష్ట్రంలో దాదాపు 58.18 లక్షల బోగస్ ఓటర్లు

నకిలీ ఓటర్ల చేర్పుపై పవర్ పాయింట్ ప్రదర్శన

వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి

ఢిల్లీ: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఎంతటి దారుణంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదో  కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌ దృష్టికి తీసుకెళ్ళామని వైయస్‌ఆర్‌సీపీ  అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు.ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్‌తో భేటీ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నకిలీ ఓటర్లను గుర్తించామని..సేకరించిన సాక్ష్యాధారాలను కేంద్ర సీఈసీకి సమర్పించామని తెలిపారు. నకిలీ ఓట్లను ఎలా చేర్పించారో ప్రజంటేషన్‌ ద్వారా సీఈసీకి వివరించామన్నారు. నకిలీ,చెల్లని బోగస్‌ ఓట్లను వెంటనే తొలగించాలని విజ్ఞప్తి చేశామన్నారు. సెప్టెంబర్‌ 2018 నాటికి 52 లక్షల 67వేల నకిలీ ఓట్లు చేర్చారని వైయస్‌ జగన్‌ తెలిపారు. ప్రస్తుతం నకిలీ ఓట్ల సంఖ్య 59.18 లక్షలకు చేరిందన్నారు. 60లక్షల ఓట్లు డూప్లికేట్‌ రూపంలో ఉన్నాయి. ఒక వైపు డబుల్‌ ఓట్లను పెంచుకోవడానికి  చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే..మరోవైపు వైయస్‌ఆర్‌సీపీ సానుభూతిపరుల పేర్లను వివిధ సర్వేల పేరుతో తొలగించే కార్యక్రమం చేస్తున్నారన్నారు. ఇందులోభాగంగా  4లక్షల పైచిలుకు ఓట్లు తొలగించారని తెలిపారు. 

ప్రజాసాధికారిత సర్వే, రియల్‌ గవర్నెన్స్‌ సర్వే ,పరిష్కార వేదిక అంటూ డేటా కలెక్ట్‌ చేసి వాటి సమాచారం  ద్వారా ఓట్లను తొలగిస్తున్నారన్నారు. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ.. చంద్రబాబు నాయుడు సామాజిక వర్గంలో సీఐలను డీఎస్పీలుగా ప్రమోట్  చేశారన్నారు. ప్రమోషన్లు పొందిన వారిలో 37 మంది ఉంటే..ఇందులో 35 మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వారున్నారని వైయస్ జగన్ మండిపడ్డారు.  డిఎస్పీలను సెలెక్ట్‌ చేసుకుని  పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. చంద్రబాబు సామాజికవర్గానికి సంబంధించి డిఐజి పోస్టింగ్‌ ఇచ్చారన్నారు. డిఐజి లాఅండ్‌ ఆర్డర్‌ కోఆర్డినేషన్‌ అని ఒక పోస్టు క్రియేట్‌  చేసి.. ఈ పోస్టుకు  ఆయన  సామాజిక వర్గానికి చెందిన అధికారికి పోస్టింగ్‌ ఇచ్చారన్నారు.

ఎలక్షన్ల కోసం తమ సామాజికవర్గానికి చెందినవారికి కీలకపోస్టులో పెడుతున్నారన్నారు.చంద్రబాబు ఆధ్వర్యంలో డిజిజి ఠాకూర్‌ పోలీసు వ్యవస్థను ఏవిధంగా భ్రష్టుపట్టిస్తున్నారో ఆధారాలతో సహా ఫిర్యాదు చేశామన్నారు. గతంలో ఏవిధంగా డిజిపి.. చంద్రబాబుకు కొమ్ముకాశారు. నాపై హత్యాయత్నం జరిగితే గంటలోపు విచారణ జరపకుండా ప్రెస్‌మీట్‌ పెట్టి ఏవిధంగా తప్పుదోవ పట్టించారో కూడా ఫిర్యాదుచేశామన్నారు. ఎలక్షన్లు సక్రమంగా జరగాలంటే డిజీపీ ఠాకూర్, అడిషనల్‌ డిజిపి  ఏబీ వెంకటేశ్వరరావు, డిఐజి లా అండ్‌ కోఆర్టినేషన్‌ ఘట్టమనేని శ్రీనివాస్‌ను ఎన్నికల వి«ధుల నుంచి తప్పించాలన్నారు. ఈ ముగ్గురిని బదిలీ చేస్తే ఎన్నికలు సజావుగా సాగుతాయన్నారు. ఏరకంగా పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ఎన్నికలను భ్రష్టు పట్టించే చర్యలకు పాల్పడే అవకాశముందన్నారు. చంద్రబాబుపై వైయస్‌ఆర్‌సీపీ ముద్రించిన అవినీతి చక్రవర్తి పుస్తకం కూడా ఎలక్షన్‌ కమిషన్‌కు ఇవ్వడం జరిగిందన్నారు.అవినీతి సొమ్ము నుంచి దాదాపు రూ. 4వేల కోట్ల రూపాయలను చంద్రబాబు నియోజకవర్గాలకు చేర్చడం..ఆ నియోజకవర్గాలలో ప్రజలకు ఏవిధంగా ఆ డబ్బును చేర్చడానికి   పోలీసులనే వాడబోతున్నారు అనేదానిపై కమిషన్‌ దృష్టికి తీసుకెళ్ళామన్నారు. దీనిపై కేంద్ర హోంశాఖకు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు.

 2014 ఎన్నికల్లో మాపై ఒక శాతం ఓట్లతో చంద్రబాబు గెలిచారని, అప్పుడు ఈవీఎంలను చంద్రబాబు ట్యాంపర్‌ చేసే గెలిచారా అని ప్రశ్నించారు.ఇప్పుడు ఈవీఎంల ట్యాంపర్‌ ప్రస్తావన ఎందుకొస్తుందన్నారు.దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ కూడా గెలిచిందన్నారు.నిజంగా ట్యాంపరింగ్‌ చేస్తే..అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉండేవి కదా అంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు.

Back to Top