చరిత్రహీనుడు చంద్రబాబు..

తిమ్మిని బమ్మిని చేయడంతో చంద్రబాబు,మోదీ,పవన్‌లు సిద్ధహస్తులు..

విలువలకు ప్రాణం పోసిన యాత్ర ప్రజా సంకల్పయాత్ర

వైయస్‌ జగన్‌ పాదయాత్ర ఏపీ భవిష్యత్‌ను మలుపుతిప్పబోతుంది..

వైయస్‌ఆర్‌సీపీ అధికార పత్రినిధి వాసిరెడ్డి పద్మ

 

హైదరాబాద్ : ప్రజల కోసం వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మొదలుపెట్టిన  ప్రజా సంకల్పయాత్ర మహోద్యమంలా మారిందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఏడాది పాటు సాగుతున్న సంకల్పయాత్ర ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్‌ను మలుపు తిప్పబోతుందన్నారు.వైయస్‌ జగన్‌ పాదయాత్ర రాష్ట్రంలో అనేక రాజకీయ మార్పులు తీసుకొచ్చిందన్నారు. ప్రజా సంకల్పయాత్ర ప్రారంభం అయ్యే సమయంలో రాష్ట్రంలో చంద్రబాబు,మోదీ,పవన్‌ మూడు ముఖాలు కలిసి కనబడ్డాయన్నారు. మోదీ,చంద్రబాబు,పవన్‌ కల్యాన్‌ ఈ ముగ్గురు కూటమి తిమ్మిని బొమ్మిని చేయడంతో ఆరితేరిపోయారన్నారు.

అభూత కల్పనలు సృష్టిస్తూ తెగ పోగుడుకుంటూ..బాబు,మోదీ జోడిలో అద్భుత పాలన సాగుతుందని ప్రజలను నమ్మించారన్నారు. చంద్రబాబు మాటలకు నిలువెల్లా మోసపోయామని  ఉవెత్తున్న సాగుతున్న ప్రజా సంకల్పయాత్రకు  ప్రజలు కదిలివచ్చిన తర్వాత ముగ్గురిగా ఉండటం కుదరదనే పరిస్థితి ఏర్పడిందన్నారు.వైయస్‌ జగన్‌ పాదయాత్రలో  ముగ్గురు కలిసి చేస్తున్నా అన్యాయాన్ని ప్రజలు ప్రశ్నించారన్నారు. మొట్టమొదటిగా ప్రత్యేకహోదాపై వైయస్‌ జగన్‌ అహర్నిశలు శ్రమిస్తూ ఉద్యమాలు చేసిన కారణంగా ప్రత్యేకహోదాను వెక్కిరించిన చంద్రబాబు యూటర్న్‌ తీసుకుని రాష్ట్రానికి ప్రత్యేకహోదా రావాల్సిందేని డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేకహోదా సాధించడంలో  చంద్రబాబు రాజకీయ అనుభవం ఏమైపోయిందని ప్రజలు నిలదీస్తున్నారు.రాజకీయాల కోసం చంద్రబాబు దేనికైనా దిగజారిపోతాడని సామాన్యుడికి సైతం అర్ధమవుతోందన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం,మంత్రులను చేయడం వంటి అప్రజాస్వామిక విధానాలను ప్రజలు గ్రహించారన్నారు. చంద్రబాబు బీజేపీతో కలిసే ఉన్నాడా లేక బీజేపీతో శాశ్వతంగా విడిపోయాడా అనేది కాలమే చెబుతోందన్నారు. బద్ధశ్రతువు కాంగ్రెస్‌తో జతకట్టి వెంపర్లాడి తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు అభాసుపాలయ్యారన్నారు.

హైదరాబాద్‌ సగభాగంలో ఉండే ఏపీ ప్రజలు చంద్రబాబును పూర్తిగా తిరస్కరించారన్నారు. చంద్రబాబు వైయస్‌ జగన్‌పై ఎన్ని కుట్రలు చేసిన, ఎన్ని ఆటంకాలు కల్పించినా అన్నింటిని ధైరంగా ఎదుర్కొంటూ, ఛేదించుకుంటూ సాగిపోతున్నారన్నారు. వెనక్కి తగ్గకుండా చిరునవ్వుతో సాహసయాత్రగా పాదయాత్ర చేస్తున్నారన్నారు. చంద్రబాబు గ్రాఫ్‌ దారుణంగా పడిపోయిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు.  ఫిరాయింపు ఎమ్మెల్యేలను ప్రోత్సహించడమే కాకుండా వారికి మంత్రి పదవులిచ్చి అసెంబ్లీ గౌరవాన్ని బజారుకీడ్చిన చరిత్రహీనుడుగా చంద్రబాబు నిలిచిపోయారన్నారు. చంద్రబాబు రాజకీయాలను భ్రష్టుపట్టించారన్నారు.

ప్రజలను నమ్ముకుని, ప్రజలకష్టాలను తీర్చడం కోసం అంకుఠిత దీక్షగా చేస్తున్న వైయస్‌ జగన్‌ పాదయాత్ర దేశచరిత్రలోనే నిలిచిపోతుందన్నారు. విలువలకు ప్రాణం పోసిన యాత్ర ప్రజా సంకల్పయాత్ర అని అన్నారు. బీజేపీతో కలిసి  చంద్రబాబు రాష్ట్రానికి అన్యాయం చేశారని, .కాంగ్రెస్‌తో జతకట్టడంతో టీడీపీ ఎంత పతనానికి దిగజారింతో అర్ధమవుతోందని దుయ్యబట్టారు. ఎవరి తీసిన గొంతుల్లో వారే పడతారనేది  తెలంగాణ ఎన్నికల్లో స్పష్టమయిందన్నారు. .9 సంవత్సరాలుగా వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై ఎన్నో కుట్రలు చేసి ఇబ్బందులు పాలు చేసిన చంద్రబాబు ఇవేమీ పనిచేయడం లేదని వైయస్‌ జగన్‌ను భౌతికంగా తుదముట్టించడానికి ప్రయత్నాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైయస్‌ జగన్‌పై హత్యాయత్నంలో టీడీపీ నేతలను తప్పించి వాస్తవాలు బయటకు రాకుండా చేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రానికి సిబిఐ,ఐటి,ఈడిలు రావద్దనే స్థాయికి చంద్రబాబు దిగజారడం సిగ్గుచేట్టన్నారు. రాష్ట్ర ప్రజల మనసులను గెలవలేక,రాష్ట్రంలో జరుగుతున్న అవినీతితో రాష్ట్ర ప్రజలను ఓట్లు అడగలేక దేశంలో చక్రం తిప్పుతా.. దేశంలో పార్టీలన్నీ ఏకం చేస్తానంటూ  డ్రామాలకు తెరలేపాడన్నారు. ఇంటగెలవలేక రచ్చ గెలవడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ నాలున్నరేళ్ల పాలనలో  జరుగుతున్న అవినీతి బండారాన్ని  చంద్రబాబు హయాంలో పనిచేసిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులైన మాజీ సీఎస్‌లు బయటపెట్టడంతో దేశ చ్రరితలోనే లేదన్నారు. ఎంత విచ్చలవిడిగా అవినీతి జరుగుతుందో అర్ధమవుతోందన్నారు. కరువు  రాష్ట్రంలో తాండవిస్తోందని, ఉపాధి లేక ప్రజలు వలసపోవాల్సి వస్తుందన్నారు. ఇవేమీ చంద్రబాబుకు పట్టడంలేదన్నారు.

Back to Top