వైయస్ జగన్ సీఎం అవుతారు

అవంతి శ్రీనివాసరావు 

విశాఖపట్నం : భూదందాలు, ఎన్నో అక్రమాలు టీడీపీ ప్రభుత్వంలో జరిగాయని..  రాజకీయాలు దిగజారడానికి చంద్రబాబే కారణమని.. భీమిలి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అవినీతి చేయలేదని తిరుపతి వెంకన్న మీద ఒట్టు వేయమని సవాల్‌ విసిరారు. చంద్రబాబుకు ఓడిపోతారనే భయం పట్టుకుందని అన్నారు. 

గత ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీని భూస్థాపితం చేయండని చెప్పిన బాబు.. ఈ సారి బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయండని అంటున్నారని గుర్తు చేశారు. 120సీట్లతో ఘన విజయం సాధించి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వైఎస్‌ జగన్‌ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. మోడీ గానీ, కేసీఆర్‌ గానీ ఆంధ్రలో ఓటు వేయమని ఎవరినైనా అడిగారా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు వారంటే భయమెందుకని నిలదీశారు. చంద్రబాబు విధానాల వల్ల రాష్ట్రంలో ధనికులు ధనికులుగా..పేదలు పేదలుగానే ఉన్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో సహాయం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. 

Back to Top