సీఎం వైయస్‌ జగన్‌ను ఎదుర్కొలేకే చంద్రబాబు దొడ్డిదారులు

పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌

తిరుమ‌లః  సీఎం వైయస్‌ జగన్‌ను ఎదుర్కొలేకే చంద్రబాబు టీడీపీ ఎంపీలను బీజేపీలోకి పంపుతున్నారని పర్యాటక,సాంస్కృతికం,యువజన వ్యవహారాల శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే బీజేపీలోకి వలస వెళుతున్నారని పేర్కొన్నారు.తిరుమల శ్రీవారిని దర్శించకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.చంద్రబాబు.. ఎమ్మెల్యేలను పంపించినా అశ్చరం లేదన్నారు.గత ఐదేళ్లలో జరిగిన అవినీతిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు.చంద్రబాబు..దొడ్డిదారిన ఆయన అనుచరులను పంపిస్తున్నారని విమర్శించారు.జరుగుతున్న పరిణామాలను ప్రజలందరూ గమనిస్తున్నారని తెలిపారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top