వైయస్‌ జగన్‌తో అవంతి శ్రీనివాస్‌ భేటీ

హైదరాబాద్‌:  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్‌ భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్‌లోని వైయస్‌ జగన్‌ ఇంటికి శ్రీనివాస్‌ చేరుకున్నారు. గత కొంత కాలంగా చంద్రబాబు వ్యవహార శైలిపై అసంతృప్తిగా ఉన్న అవంతి శ్రీనివాస్‌ టీడీపీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరే యోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం.

నిన్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ టీడీపీకి రాజీనామా చేసి వైయస్‌ జగన్‌ను కలిసిన విషయం విధితమే. 24 గంటలు గడువకముందే మరో అధికార పార్టీ నేత వైయస్‌ జగన్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయి ఒక్కక్కరుగా పార్టీ వీడుతున్నారు.
 

Back to Top