త్వ‌ర‌లోనే ఎల్జీ పాలిమ‌ర్స్‌పై చ‌ర్య‌లు

ప్ర‌మాద‌క‌ర కంపెనీల విష‌యంలో రాజీ ప‌డేది లేదు

వైయ‌స్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభించిన మంత్రి అవంతి శ్రీ‌నివాస్‌

విశాఖ‌ప‌ట్నం: హై పవర్ కమిటీ నివేదిక ఆధారంగా ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి అవంతి శ్రీ‌నివాస్‌ పేర్కొన్నారు. ప‌్ర‌మాద‌క‌ర కంపెనీల విష‌యంలో రాజీ ప‌డేదే లేద‌ని  తేల్చి చెప్పారు. ప్ర‌మాద‌ర‌క ప‌రిశ్ర‌మ‌లు నివాస ప్రాంతం నుంచి త‌ర‌లించాల‌ని ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఆదేశించారన్నారు. మంగ‌ళ‌వారం అవంతి శ్రీ‌నివాస్‌ వెంక‌టాపురంలో వైయ‌స్ఆర్‌ విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభించారు. ఇక‌పై వెంకటాపురం కేంద్రంగా వైయ‌స్ఆర్ క్లినిక్ ద్వారా 24 గంటల వైద్య సేవలు అందుతుంద‌ని మంత్రి తెలిపారు.  ఈ సంద‌ర్భంగా ఐదు గ్రామాల ప్ర‌జ‌ల‌కు హెల్త్ కార్డులు మంజూరు చేశారు. 

త్వ‌ర‌లోనే వైయ‌స్ఆర్ క్లినిక్ భ‌వ‌నం నిర్మిస్తాం 
  త్వ‌ర‌లో స్థలం గుర్తించి వైయ‌స్ఆర్ క్లినిక్ భవనం నిర్మిస్తామ‌ని మంత్రి హామీ ఇచ్చారు. గ్యాస్ ప్ర‌భావిత ప్రాంత ప్ర‌జ‌ల‌కు అన్ని ర‌కాల వైద్యం అందుతుంద‌ని తెలిపారు. అవ‌స‌ర‌మైతే ప్ర‌త్యేక వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటార‌ని స్ప‌ష్టం చేశారు. 

Back to Top