రాష్ట్ర‌ప‌తి ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు

ఈ సంద‌ర్భంగా వారు ద్రౌప‌ది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు

న్యూఢిల్లీ:  పార్లమెంటు సెంట్రలో హాలులో నూత‌న రాష్ట్ర‌ప‌తిగా ద్రౌపది ముర్ము ప్ర‌మాణ స్వీకారం చేశారు.  సుప్రీం కోర్టు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ద్రౌపది ముర్ముతో ప్రమాణం చేయించారు. ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌, పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వి.విజ‌య‌సాయిరెడ్డి, పార్టీ లోక్‌స‌భ ప‌క్ష నేత మిథున్‌రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు ద్రౌప‌ది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేర‌కు విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. 

భారతదేశపు మొదటి గిరిజన & 2వ మహిళా రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారు పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆమె పదవీ కాలంలో దేశం యొక్క రాజ్యాంగ విలువలను పెంచుతారని మరియు గౌరవిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. 

Back to Top