అసెంబ్లీలో టీడీపీ సభ్యుల దౌర్జన్యం 

స్పీకర్‌ ముఖంపై ఫ్లకార్డు పెట్టిన టీడీపీ ఎమ్మెల్యే డోలా

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే సుధాక‌ర్‌బాబుపై దాడి

డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామిపై దూష‌ణ‌ల ప‌ర్వం

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో టీడీపీ స‌భ్యులు దౌర్జ‌న్యానికి పాల్ప‌డ్డారు. స్పీకర్‌ పట్ల వద్ద టీడీపీ నేతలు అనుచితంగా వ్య‌వ‌హ‌రించారు. పేపర్లు చించి స్పీకర్‌పైకి విసిరారు. స్పీకర్‌ విజ్ఞప్తి చేసినా టీడీపీ నేత‌లు ప‌ట్టించుకోలేదు. స్పీకర్‌ ముఖంపై టీడీపీ ఎమ్మెల్యే డోలా ఆంజ‌నేయులు ఫ్లకార్డు పెట్టారు. టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం అసహనం వ్య‌క్తం చేశారు.  సభా సమయాన్ని వృథా చేయడంపై స్పీకర్‌ అసంతృప్తి చేశారు. స్పీక‌ర్‌పై దాడి చేసేందుకు  టీడీపీ నేత‌లు ప్ర‌య‌త్నిస్తుండ‌టంతో ప్ర‌తిప‌క్ష నేత‌ల తీరును గ‌మ‌నించిన వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు రక్షణగా పోడియం వద్దకు వెళ్లారు. ఈ స‌మ‌యంలో వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల‌పై టీడీపీ నేత‌లు దాడికి పాల్ప‌డ్డారు.  ఈ క్ర‌మంలో వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్‌బాబు మోచేతికి గాయం చేశారు. అలాగే డోలా వీరాంజ‌నేయులు సుధాకర్‌ బాబుపై దూషణలకు దిగారు. టీడీపీ నేత‌ల‌ను వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ వారిస్తుండ‌గా టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి నెట్టేశారు. దీంతో వెల్లంప‌ల్లి స‌భ‌లో కింద‌ప‌డ్డారు.  డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై టీడీపీ ఎమ్మెల్యే డోలా దూషణల‌కు దిగారు.  టీడీపీ ఎమ్మెల్యే డోలా త‌న‌పై దాడి చేశార‌ని ఎమ్మెల్యే సుధాకర్‌ బాబు పేర్కొన్నారు. చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు పెట్టాల‌ని ఆయ‌న డిమాండు చేశారు. సభలో గొడవ చేయించింది చంద్రబాబే అని, టీడీపీ ఎమ్మెల్యేలతో మాపై దాడి చేయించార‌ని సుధాక‌ర్‌బాబు పేర్కొన్నారు.

Back to Top