ఐదోరోజు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

గత ప్రభుత్వం ప్రాజెక్టుల అంచనాలు పెంచి అవినీతికి పాల్పడింది

అవినీతి కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డి
 

అమరావతిః ఐదవ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బుధ‌వారం  అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. నేడు కూడా బడ్జెట్‌పై చర్చ కొనసాగనుంది.  గత ప్రభుత్వం ప్రాజెక్టుల అంచనాలు పెంచి అవినీతికి పాల్పడిందని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. అవినీతి కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతలో రూ.150 కోట్ల పనులను నామినేషన్‌  పద్దతిలో కట్టబెట్టారు.టీడీపీకి అనుకూలమైన కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చారని తెలిపారు. గొల్లపల్లి రిజర్వాయర్‌కు రూ.6 కోట్లు అధికంగా చెల్లించారని తెలిపారు. పులిచింతల ప్రాజెక్టును గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రాజెక్టుల నిధులు కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్తున్నాయన్నారు. 
 
 

Back to Top