ఆశా వర్కర్ల జీతాలు భారీగా పెంపు

రూ.10వేలకు పెంచిన ప్రభుత్వం
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం వైయస్‌ జగన్‌
జీతాలు పెంపుపై ఆశావర్కర్ల హర్షం

అమరావతి: ఏపీలో ఆశా వర్కర్ల జీతాలు భారీగా పెంపు నిర్ణయంతో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం వైయస్‌ జగన్‌ నిలబెట్టుకున్నారు. ఆశావర్కర్ల జీతం పెంచుతూ సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రూ.3వేలు ఉన్న ఆశావర్కర్ల జీతాన్ని రూ.10వేలకు పెంచుతున్నట్లు సీఎం వైయస్‌ జగన్‌ ప్రకటించారు.

పాదయాత్రలో  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చాలా సార్లు ఆశా వర్కర్లు కలిసి తమ జీవన స్థితిగతులను వివరించారు. వారికి ఇచ్చిన మాట ప్రకారం జీతాలు పెంచుతూ ఆచరణలోకి తీసుకువచ్చారు. ఆశావర్కర్లు సంతోషంగా ఉంటేనే గ్రామీణ స్థాయిలో వైద్య సేవలు సమర్థవంతంగా అందించగలమని సీఎం భావించారు.జీతాలు పెంపు పట్ల ఆశావర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top