సీఎం వైయస్‌ జగన్‌కు అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎం కృతజ్ఞతలు

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమఖండు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు పెమఖండు ట్విటర్‌లో స్పందిస్తూ.. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో విశాఖపట్నంలో ఉంటున్న అరుణాచల్‌ ప్రదేశ్‌ వాసులు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసిన వెంటనే సీఎం వైయస్‌ జగన్‌ స్పందించటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తమ రాష్ట్రవాసులకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. రానున్న రోజుల్లో కూడా తమ రాష్ట్రానికి చెందిన వారికి అండగా ఉంటారని ఆకాంక్షిస్తున్నానని పెమఖండు ట్వీట్‌ చేశారు. 

Back to Top