బాబుకు ప‌ట్టిన గ‌తే ప‌వ‌న్‌కు ప‌డుతుంది

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ‌

పవన్‌కల్యాణ్‌పై ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ ధ్వజం

 అరకు: విశాఖకు వ్యతిరేకంగా మాట్లాడితే చంద్రబాబుకు విశాఖ ఎయిర్‌పోర్టులో పట్టిన గతే పవన్‌కు పడుతుందని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ హెచ్చరించారు.  విశాఖలో​ రాజధాని వద్దనే హక్కు పవన్‌కల్యాణ్‌కు లేదని మండిపడ్డారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..పవన్‌కల్యాణ్‌లో మరోసారి అపరిచితుడు బయటపడ్డారని విమర్శించారు. గాజువాక ప్రజలు ఛీ కొట్టడంతో విశాఖకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నారు. విశాఖ మరో నందిగ్రామ్‌ అవుతుందనే పవన్‌ మాటల్లో అర్థం ఏమిటి?. విశాఖలో విధ్వంసానికి చంద్రబాబు నాయుడుతో కలిసి కుట్ర పన్నుతున్నారా?’’  అని ప్రశ్నించారు. 
 పవన్‌కల్యాణ్‌కి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదు. గతంలో పాడేరు నుంచి పోటీ చేస్తానని పవన్ అన్న మాటలు జనం మరిచిపోలేదు. అదో పెద్ద జోక్ గా గిరిజనం చెప్పుకుంటున్నారు. మీకు రాజకీయాల్లో చంద్రబాబు పరువు లేకుండా చేశారు. ఇప్పుడు సినిమాల్లో నటిస్తే కనీసం ఆస్తులైనా మిగులుతాయని ఎమ్మెల్యే ఫాల్గుణ హితవు పలికారు

Back to Top