అప్పయ్యపేట గ్రామంలో గడపగడపకు మనప్రభుత్వం 

సంక్షేమ ప‌థ‌కాల‌ను వివ‌రించిన ఎమ్మెల్యే  అలజంగి జోగారావు
 

పార్వ‌తీపురం: పార్వతీపురం నియోజకవర్గం, సీతానగరం మండలం, పెదభోగిలి-2 సచివాలయం పరిధిలోని అప్పయ్యపేట గ్రామంలో ఎమ్మెల్యే  అలజంగి జోగారావు  గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేప‌ట్టారు. గురువారం ఉదయం ప్రారంభమై సాయంత్రం వరకు నిరంతరంగా ఈ కార్య‌క్ర‌మం కొన సాగుతుంది. ఈ సంద‌ర్భంగాఎమ్మెల్యే  గడప గడపకు వెళ్లి ప్రజలను కలుసుకుని వారికి ప్రభుత్వం చేసిన మేలును వివరించి, వారి సమస్యలు పరిష్కరించి వారి వద్ద నుంచి ఆశీర్వాదములు తీసుకుంటున్నారు.   కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు స్థానిక ఎంపీటీసీ సభ్యులు బురిడీ కుసుమ, సూర్యనారాయణ దంపతులు, పంచాయతీ ప్రజా ప్రతినిధులు, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, ప్రజలు, మండల అధికారులు, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు.
 

Back to Top