వరదలపై టీడీపీ నేతలు ఛీప్‌ పాలిటిక్స్‌

ఏపీఐఐసీ చైర్మన్‌ ఆర్కే రోజా
 

అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతలు వరదలపై ఛీప్ పాలిటిక్స్ చేస్తున్నారని ఏపీఐఐసీ చైర్మన్‌, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. నిండుకుండలా ఉన్న ప్రాజెక్టులను చంద్రబాబు చూడలేకపోతున్నారని ఫైర్‌ అయ్యారు. వరదపై డ్రోన్ వినియోగిస్తే చంద్రబాబు రాద్దాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వరదలపై ప్రభుత్వం, అధికారులు సమన్వయంతో పని చేశారని, ఎక్కడా కూడా ఆస్తినష్టం, ప్రాణనష్టం జరుగలేదన్నారు. చంద్రబాబుకు ఎక్కడ తన ఇల్లు మునుగుతుందనే భయం తప్ప, బాధితుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. వరదలు తగ్గిన తరువాత ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. 

Back to Top