ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ నంబ‌ర్ వ‌న్‌

బిజినెస్‌ రీఫార్మ్స్‌ యాక్షన్‌ ప్లాన్‌-2020 ఏపీకి టాప్ ర్యాంకు 

అమ‌రావ‌తి:  ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరోసారి సత్తా చాటింది. బిజినెస్‌ రీఫార్మ్స్‌ యాక్షన్‌ ప్లాన్‌-2020లో ఏపీ టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌.. గురువారం టాప్‌ అచివర్స్‌లో 7 రాష్ట్రాలను ప్రకటించారు.

కాగా, ఈ లిస్టులో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. టాప్‌ అచివర్స్‌లో ఏపీతో పాటు గుజరాత్‌, హర్యానా, కర్నాటక, పంజాబ్‌, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. కేంద‍్ర ప్రభుత్వం నాలుగు కేటగిరీలుగా రాష్ట్రాలకు ర్యాంకులను ఇచ్చింది. ఇక, అచివర్స్‌ లిస్టులో హిమాచల్‌ ప్రదేశ్‌, మధ్యప‍్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిషా, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు ఉన్నాయి.  

Back to Top