జ‌గ‌న‌న్న‌కు జన్మజన్మలా రుణపడి ఉంటాను 

 ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్ దవులూరి దొరబాబు 

సామ‌ర్ల‌కోట‌:  ఒక సామాన్యుడిని వైయ‌స్ఆర్‌సీపీ పెద్దాపురం నియోజకవర్గం ఇన్‌చార్జిగా నియమించడమే కాదు, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్ధ చైర్మన్‌ గా అవకాశమిచ్చార‌ని ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్ దవులూరి దొరబాబు పేర్కొన్నారు. నేను పుట్టిన గడ్డ మీద, నేను చదువుకున్న ఈ కళాశాల మైదానంలో ఇన్ని వేల మంది ముందు మాట్లాడే స్ధాయిలో నిలబెట్టినందుకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి జన్మజన్మలా రుణపడి ఉంటాను, మీ మాటే నాకు వేదం అన్నారు.  కాకినాడ జిల్లా సామర్లకోటలో పేద అక్కచెల్లెమ్మలకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ లాంఛనంగా ఇళ్ళను అందించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో దొర‌బాబు మాట్లాడారు. 

అందరికీ నమస్కారం, అన్నా గతంలో వైయ‌స్‌ రాజశేఖర్‌ రెడ్డి గారు ఇక్కడ రాజీవ్‌ గృహకల్ప ప్రారంభించి, ఇక్కడే బహిరంగ సభ నిర్వహించారు, మళ్ళీ మీరు ఇక్కడే ఇళ్ళను అందించి సభ నిర్వహించడం మా అదృష్టం, ఇద్దరు సీఎంలు మా పెద్దాపురం నియోజకవర్గం రావడం చాలా సంతోషంగా ఉంది, అన్నా నేను సామాన్యుడిని, నన్ను పెద్దాపురం నియోజకవర్గం ఇన్‌చార్జిగా నియమించడమే కాదు, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్ధ చైర్మన్‌ గా అవకాశమిచ్చారు, నేను పుట్టిన గడ్డ మీద, నేను చదువుకున్న ఈ కళాశాల మైదానంలో ఇన్ని వేల మంది ముందు మాట్లాడే స్ధాయిలో నిలబెట్టినందుకు మీకు జన్మజన్మలా రుణపడి ఉంటాను, మీ మాటే నాకు వేదం అన్నా, గడప గడపకూ కార్యక్రమంలో మీరు కల్పించిన భరోసా, వివిధ పథకాల వల్ల వారంతా సంతోషంగా ఉన్నారు, మేం టీడీపీ సానుభూతిపరుల ఇంటికి వెళితే చంద్రబాబు హయంలో జన్మభూమి కమిటీలు దోచుకున్నాయని, మేం మీ పార్టీకి ఓటేయకపోయినా మాకు అన్ని పథకాలు ఇచ్చారు, ఈ సారి తప్పకుండా మా ఓటు మీకే అని బటన్‌ నొక్కుతాం అన్నారు, సెల్పీ కూడా తీసుకోలేని చంద్రబాబు జగనన్న మొహం చూడండి, ఎంత చిరునవ్వుతో ఉన్నారో, చంద్రబాబు ఈ రోజు ఎక్కడున్నారు, స్నేహ బ్లాక్‌ లో కూర్చున్నాడు, 175 కి 175 స్ధానాలు గెలిచి వైఎస్‌ జగన్‌ అనే నేను రెండోసారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసే రోజుకు ఏపీ యావత్తు ఎదురుచూస్తుంది. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో మౌలిక వసతులు లేవు అన్నా, మీరు నిధులు కేటాయించి పూర్తి చేస్తారని భావిస్తున్నాను, అలాగే మరికొన్ని స్ధానిక సమస్యలను కూడా మీరు పరిష్కరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 

అన్నా నువ్వెప్పుడూ చల్లగా సుఖసంతోషాలతో ఉండాలి: బోళాకుమారి, లబ్ధిదారు, వేట్లపాలెం

అన్నా నమస్కారం, నాకు సామర్లకోట హైవేలో సెంటున్నర స్ధలం వచ్చింది, దాని విలువ పది లక్షల పైనే ఉంటుంది, నా ఊహకందని డబ్బు అది, నేను ఒంటరి మహిళను, మీ దయ వల్ల చక్కటి ఇల్లు కట్టుకున్నాను, నాకు ఇల్లే కాదు అన్ని సౌకర్యాలు కల్పించారు, మా కాలనీ చాలా బాగుంది, గతంలో నేను పనిమానుకుని ఇళ్ళ పట్టాల కోసం వెళ్ళేదానిని, కానీ ఇప్పుడు నేను అందంగా ఇల్లు కట్టుకున్నాను, గతంలో ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుకోసం చాలా ఖర్చుపెట్టుకునేవాళ్ళం కానీ ఇప్పుడు నేరుగా నా అకౌంట్‌లో డబ్బులు వేశారు. నాకు ఇద్దరు పిల్లలు, నా పిల్లలు గవర్నమెంట్‌ స్కూల్‌ లో చక్కగా ఇంగ్లీష్‌ చదువుకుని మాట్లాడుతుంటే నాకు జరగనిది నా పిల్లలకు జరుగుతుందన్న ఆనందం ఉంది. నేను తల్లిగా చాలా సంతోషిస్తున్నా, మీ దయ వల్లే ఇదంతా, మా నాన్నకు ఆరోగ్యశ్రీ లో చికిత్స అంది ప్రాణాలతో ఉన్నారంటే మీరే కారణం, గతంలో రూ. 200 ఫించన్‌ కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురుచూసేవారు, కానీ ఇప్పుడు సూర్యుడి కంటే ముందు మా గుమ్మం తట్టి రూ. 2750 మా చేతిలో పెడుతున్నారు. నాకు చాలా ఉపయోగపడుతుంది, అన్నా నువ్వెప్పుడూ చల్లగా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను, థ్యాంక్యూ అన్నా.

Back to Top