ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌గా కొడాలి నాని 

ప్లానింగ్‌ బోర్డు వైస్‌ ఛైర్మన్‌గా మల్లాది విష్ణు
 

అమరావతి: ఏపీ కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణ నేపథ్యంలో గతంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన  కొడాలి నానికి ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌గా అవకాశం కల్పించనున్నారు. కేబినెట్‌ హోదాలో ఆయనకు రాష్ట్ర అభివృద్ధి బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించనున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డును త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ప్లానింగ్‌ బోర్డు వైస్‌ ఛైర్మన్‌గా మల్లాది విష్ణును నియమించనున్నారు. 

Back to Top