టెన్త్‌ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

అమరావతి: పదో తరగతి పరీక్షలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో 11 పేపర్లుగా ఉన్న పదో తరగతి పరీక్షలను ఆరు పేపర్లకు కుదించింది. ప్రతీ పేపర్‌కు 100 మార్కులు ఉండేలా నిర్ణయించింది. జూలై 10 నుంచి 15వ తేదీ వరకు టెన్త్‌ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ అధికారులు సుదీర్ఘ సమీక్షా సమావేశం అనంతరం ఈ వివరాలను వెల్లడించారు. 10న ఫస్ట్‌ లాంగ్వేజ్‌, 11న సెకండ్‌ లాంగ్వేజ్‌, 12న థర్డ్‌ లాంగ్వేజ్‌, 13న గ‌ణితం, 14న సైన్స్‌, 15వ తేదీ సోషల్‌ సబ్జెక్ట్‌కు పరీక్షలు నిర్వహిస్తారు. ప‌రీక్ష‌లు ఉద‌యం 9:30 నుంచి మ‌ధ్యాహ్నం 12:45 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. 

Back to Top