అధైర్య ప‌డొద్దు ..అండ‌గా ఉంటా

సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌లకు వైయ‌స్ జ‌గ‌న్ భ‌రోసా

బాధితుల‌కు అందుబాటులో వైయ‌స్ఆర్‌సీపీ లీగ‌ల్ సెల్  

తాడేప‌ల్లి:  ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే గొంతు నులుముతున్న  పాలకులపై వైయ‌స్ఆర్‌సీపీ పోరాడుతోంది. ప్ర‌భుత్వం చేస్తున్న అక్ర‌మ అరెస్టులు, కేసుల‌కు అధైర్య‌ప‌డొద్దు..అండ‌గా ఉంటాన‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భ‌రోసా క‌ల్పించారు. బాధితులకు వైయ‌స్ఆర్‌సీపీ లీగ‌ల్ సెల్‌ అండగా నిలుస్తూ.. న్యాయ సహాయం అందిస్తోంది. అంతేకాదు.. అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపై ప్రయివేటు కేసులు పెడతామని ఇదివరకే వైయ‌స్ జ‌గ‌న్ హెచ్చరించారు.

ఏపీలో అక్రమ కేసులు, నిర్బంధాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే వందలాది మంది వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారు. కార్యకర్తలే కాదు.. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపైన కూడా కుట్రపూరితంగా కేసులు పెడుతోంది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలో.. ఇంటూరి రవికిరణ్‌పై వేధింపుల పర్వం కొనసాగుతోంది. ఆయన్ని స్టేషన్లు మారుస్తూ వేధిస్తున్నారు. వర్రా రవీంద్రారెడ్డిని శారీరకంగానూ హింసించి.. జైలు పాలు చేశారు. చివరికి.. తనకు నచ్చినట్లుగా సినిమా తీసే సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మను చంద్రబాబు ప్రభుత్వం వదల్లేదు 

ఎలాంటి అన్యాయం జరిగినా వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుంది. 
ఆప‌ద వ‌స్తే సెల్ నంబ‌ర్లు..9440284455, 9963425526, 9912205535 ఫోన్‌ చేయండి. 
మీ తరపున పోరాటం చేయడానికి వైయ‌స్ఆర్‌సీపీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది.
- వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 

Back to Top