హోదా హామీని కేంద్రం నిలబెట్టుకోవాలి

ఏపీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది

ఆంధ్రరాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాలి

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డి

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డి కేంద్రప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రరాష్ట్ర భవిష్యత్తు ప్రత్యేక హోదాతో ముడిపడి ఉందన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ.. విభజన హామీలు అమలు చేయాలని, పోలవరం ప్రాజెక్టు, రామాయపట్నం పోర్టు, విశాఖ రైల్వేజోన్‌ అంశాలను ప్రస్తావించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీని ఆదుకోవాలని కేంద్రాన్ని కోరారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేసినప్పుడు ప్రజలంతా ప్రత్యేక హోదా సాధించాలని ప్రజలంతా ముక్తకంఠంతో కోరారన్నారు. ఏపీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని, ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రం ఆదుకోవాలన్నారు. పోలవరానికి నిధుల మంజూరులో జాప్యం జరుగుతోందని, రామాయపట్నం పోర్టు, విశాఖ రైల్వేజోన్‌ పనులు పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top