పాలిసెట్‌ ఫలితాలు విడుదల చేసిన మంత్రి బుగ్గ‌న‌

విజ‌య‌వాడ‌:  ఏపీ పాలిసెట్ -2023 ఫలితాలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేశారు.  ఈ నెల 10వ తేదీన పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పాలిసెట్-2023)ను నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 87 ప్రభుత్వ, 171 ప్రైయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 29 బ్రాంచ్‌లలో మూడేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 1,59,144 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకోగా 1,43,625 మంది పరీక్షకు హాజరయ్యారు. 
►అర్హత సాధించిన 1,24,021 మంది విద్యార్థులు

►మొత్తం ఉత్తీర్ణత శాతం  - 86.35 శాతం

►బాలికల ఉత్తీర్ణత - 88.90 శాతం

►బాలుర ఉత్తీర్ణత - 84.74 శాతం  

Back to Top