పంచాయతీ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భంజ‌నం 

అమ‌రావ‌తి:  పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తుదారులు ఘ‌న విజ‌యం సాధించారు.  నేటి నుంచి మొదలు వరుసగా మూడ్రోజులు రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ‘స్థానిక’ సంస్థల ఎన్నికల సందడి కొనసాగనుంది. మొత్తం 17.69 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆదివారం వివిధ జిల్లాల్లోని 36 సర్పంచ్‌ స్థానాలతో పాటు వివిధ గ్రామాల్లోని 68 వార్డు స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా.. సోమవారం నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పోలింగ్‌ జరగనుంది. 
► సాయంత్రం 5 గంటల వరకు వెలువడిన పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో వైయ‌స్సార్ కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలుపొందారు. మరికొంత మంది గెలుపు బాటలో ఉన్నారు. 

శ్రీకాకుళం జిల్లా:
►రేగిడి ఆమదాలవలస  మండలం తోకల వలస పంచాయతీలో  వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి సివ్వాల సూర్యకుమారి గెలుపు.

విజయనగరం జిల్లా:
► భోగాపురం మండలం లింగాల వలస సర్పంచ్ ఉప ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి  బుగత లలిత 42 ఓట్ల మెజార్టీతో విజయం.
► లక్కవరపుకోట మండలం రేగ పంచాయతీ 7 వ వార్డులో టీడీపీ బలపరిచిన అభ్యర్థి లెంక శ్రీను 45 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు.
► నెల్లిమర్ల మండలం, ఏటి అగ్రహారం సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సానుభూతి పరురాలు మీసాల సూర్యకాంత  44 ఓట్లు మెజారిటీ తో గెలుపొందారు.

ప్రకాశం జిల్లా : 
► కంభం మండలం కందులాపురం 6వార్డు అభ్యర్థి బండారు వరలక్ష్మి 63 ఓట్లతో విజయం.
► మద్దిపాడు 5 వార్డు అభ్యర్థి నూనె శ్రీనివాసులు వైఎస్సార్‌సీపీ మద్దతుతో 99 ఓట్లతో ఘన విజయం.
► కొత్తపట్నంలో 7వ వార్డులో వైసీపీ అభ్యర్ధి పూరిణి సరోజిని 95 ఓట్లుతో విజయం.
► తర్లుబాడు మండలం మీర్జాపేట గ్రామ 2 వ వార్డులో వైసీపీ అభ్యర్థి యోగిరవణమ్మ పై టీడీపీ అభ్యర్థి నాగజ్యోతి 30 ఓట్ల తేడతో విజయం.
► ఇంకోల్లుమండలంపూసపాడులో 5 వ వార్డులో టిడిపి అభ్యర్ది గోరంట్ల లక్ష్మీ తులసీ 101 ఓట్ల మోజార్టీ తో గెలుపు.
► కొండపి నియోజక వర్గం నిడమానూరు 12 వార్డు టీడీపీ అభ్యర్దీ కాకుమాను సుబ్బారావు 46 ఓట్లతో విజయం..
► కందుకూరు మండలం నరిశెట్టి వారి పాలెం గ్రామపంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన ముప్పాళ్ళ శ్రీనివాసరావు విజయం

గుంటూరు జిల్లా:
 ► వినుకొండ మండలం శివపురం సర్పంచ్‌గా కమతం సుబ్బమ్మ 452 మెజార్టీతో గెలుపు (వైఎస్సార్‌సీపీ)
► బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల సర్పంచ్ గా బ్రహ్మం నాయక్ 153 ఓట్లతో గెలుపు(వైఎస్సార్‌సీపీ)

విశాఖ జిల్లా 
► అమలాపురం గ్రామంలో ఐదో వార్డుకు జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి మేడపురెడ్డి నూకల తల్లి  గెలుపు.
► పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయితీ ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ బలపరిచిన సాగేని చిన్నతల్లమ 155 ఓట్లు మెజారిటీతో గెలుపు.
► ముంచంగిపుట్టు మండలం జర్రెల పంచాయితీ సర్పంచ్ ఉపఎన్నికలో వైసీపీ బలపర్చిన మైకం భాగ్యవతి 55 ఓట్ల మెజార్టీతో గెలుపు

చిత్తూరు జిల్లా
► గంగవరం మండలం తాళ్లపల్లిలో సర్పంచ్‌ ఉప ఎన్నికలలో 97 ఓట్ల ఆధిక్యంతో వైయ‌స్ఆర్‌ సీపీ బలపరిచిన అభ్యర్థి శంకరమ్మ గెలుపు.

కర్నూలు జిల్లా 
► సిరివేళ్ళ గ్రామ పంచాయతీ లోని 18 వ వార్డు ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరుపున  బి.పెదరాజు 253 ఓట్లతో గెలుపు.  
 ►సి బెళగల్ మండలం,యనగండ్ల గ్రామ పంచాయతీ  ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దత్తు దారుడు ఇమ్మానియల్ 39 ఓట్లతో గెలుపు.

కృష్ణాజిల్లా
► తోట్లవల్లూరు మండలం రొయ్యూరులో 3వ వార్డు మెంబర్‌గా వైయ‌స్సార్‌సీపీ బలపరిచిన లుక్కా నాగభూషణం 48 ఓట్ల మెజారిటీతో గెలుపు.
► నూజివీడు మండలం బూరవంచ పంచాయతీ 3వ వార్డు అభ్యర్థిగా  సయ్యద్ ఖిజర్ పాషా ఖాద్రి(వైఎస్సార్‌సీపీ) 28ఓట్ల మెజారిటీతో గెలుపు. 
ఆగిరిపల్లి మండలం చినఆగిరిపల్లి పంచాయతీ 1వ వార్డు అభ్యర్థిగా చన్ను సావిత్రి (వైఎస్సార్‌సీపీ)21 ఓట్ల మెజార్టీతో విజయం. 
 ► ముదినేపల్లి మండలం ములకలపల్లి సర్పంచ్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి నువ్వుల కోటేశ్వరరావు 57 ఓట్లతో గెలుపు. 
► ఘంటసాల మండలం దాలిపర్రులో 3వ వార్డు వైయ‌స్సార్సీపీ బలపరిచిన దాసరి నాగరాజు 26 ఓట్ల మెజారిటీతో విజయం.
 ► చల్లపల్లి మండలం ఆముదార్లంక లో 2 వార్డు ఉప ఎన్నికలలో వైయ‌స్సార్ సీపీ బలపరిచిన నాగిడి శివ పార్వతి 23  ఓట్లతో విజయం.
► కలిదిండి మండలం కలిదిండి పంచాయతీ సర్పంచ్‌గా వైయ‌స్సార్సీపీ అభ్యర్ధిని మసిముక్కు మారుతీ ప్రసన్న 249 ఓట్ల ఆధిక్యంతో విజయం.

నెల్లూరు జిల్లా
► మనుబోలు మండలం, వెంకన్నపాలెంలో 4వ వార్డు ఉపఎన్నికలలో  వైయ‌స్సార్‌సీపీ బలపరిచిన వల్లూరు శకుంతలమ్మ నాలుగు ఓట్లతో  విజయం.

అనంతపురం జిల్లా
► సోమందేపల్లి మండలం గుడిపల్లి నాలుగో వార్డు ఉప ఎన్నికలలో వైయ‌స్సార్‌సీపీ అభ్యర్థి శంకరమ్మ విజయం.
► రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామంలో 5వ వార్డ్ మెంబర్గా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రామలక్ష్మి 8 ఓట్లతో విజయం. 
► శెట్టూరు మండలం కైరేవు గ్రామ సర్పంచ్‌గా వైయ‌స్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి లక్మిదేవి 198 ఓట్ల మెజారిటీతో  ఘనవిజయం. 
► కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని శెట్టూరు మండలం కైరేవు సర్పంచ్‌గా వైఎస్సార్‌సీపీ మద్దతుదారు లక్ష్మిదేవి విజయం. 
► రాయదుర్గం  మండలం 74- ఉడేగోళం 5వ వార్డు ఎన్నికలో వైయ‌స్సార్ సీపీ మద్దతుదారు రామలక్ష్మి విజయం.
► సోమందేపల్లి మండలం గుడిపల్లి 4వ వార్డు ఎన్నికల్లో    వైయ‌స్సార్‌సీపీ అభ్యర్థి శంకరమ్మ విజయం. 
► రొద్దం మండలం చిన్నమంతూరు సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైయ‌స్సార్సీపీ మద్దతుదారు సుబ్బమ్మ విజయం. 
► పుట్లూరు మండలం కందికాపుల గ్రామ సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు కురువ శివరామయ్య 157 ఓట్లతో ఘన విజయం.

 పశ్చిమ గోదావరి జిల్లా
► తాడేపల్లిగూడెం మండలం పుల్లయ్యగూడెం వైయ‌స్సార్‌సీపీ పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి చీకట్ల పుష్ప లక్ష్మీకుమారి 60ఓట్ల మెజార్టీతో గెలుపొందింది.
► ఉండి మండలం చినపుల్లేరు 5వవార్డు వైయ‌స్సార్‌సీపీ బలపరిచిన కందుల సుభాషిణి 30 ఓట్ల మెజారిటీతో విజయం కైవసం చేసుకుంది.
► పోలవరం మండలం గూటాల గ్రామపంచాయతీ ఒకటో వార్డు వైయ‌స్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి ఇందిరా ప్రియదర్శిని 60 ఓట్ల మెజారిటీతో గెలుపు. 
► పెదవేగి మండలం రాయన్నపాలెం ఐదవ వార్డు వైయ‌స్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్ధి అవిరినేని రమేష్  23 ఓట్ల   మెజార్టీతో గెలుపు.
► కొవ్వూరు మండలం కాపవరం తొమ్మిదో వార్డు వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి గొతం మేరీ ఝాన్సీ బాయి ఆరు ఓట్ల మెజారిటీ తో గెలుపు. 
►పెరవలి మండలం ‌మల్లేశ్వరం గ్రామ పంచాయతీ 8 వార్దు ఉప ఎన్నికల్లో వైయ‌స్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థి కాపా సాంబశివరావు 67ఓట్ల మెజార్టీ తో విజయం.
► జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం  వైస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని వామిశెట్టి  892ఓట్ల మెజారిటీతో పావని విజయం.
► పోడూరుమండలం కొమ్ముచిక్కాల గ్రామ పంచాయతీ 9 వార్డు ఉప ఎన్నికల్లో వైయ‌స్సార్‌సిపి బలపరిచిన అభ్యర్థి పాతపాటి  కొండరాజు 61 ఓట్లు మెజార్టీతో  విజయం.
► ఆచంట మండలం పెదమల్లం గ్రామం వైయ‌స్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి  దిరిశాల విజయలక్ష్మి 156 ఓట్ల తో మెజారిటీ గెలుపు.

తాజా వీడియోలు

Back to Top