మూడో ద‌శ‌లోనూ పోటెత్తిన ఓట‌ర్లు

రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌శాంతంగా పంచాయ‌తీ ఎన్నిక‌ల పోలింగ్‌

అమ‌రావ‌తి:  ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్‌ బుధవారం ఉదయం ఆరున్నర గంటలకు ప్రారంభమైంది. ఓట్లు వేసేందుకు ఓటర్లు తరలివస్తున్నారు. కరోనా నేపథ్యంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుని పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. మాస్క్‌లు ధరిచేస్తే పోలింగ్‌ కేంద్రంలోకి ఓటర్లను అనుమతిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 160 మండలాల పరిధిలోని 26,851 పోలింగ్‌ కేంద్రాలలో మూడో విడత పోలింగ్ జ‌రుగుతుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగనుంది. ఆయా గ్రామ పంచాయతీల్లో పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన వెంటనే అర గంట వ్యవధిలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడతారు. 

పంచాయితీ ఎన్నికల్లో  ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. వెన్నలపాలంలో అరకు వైయ‌స్సార్‌సీపీ ఎంపీ గొట్టేటి మాధవి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొంటున్నారు. ఉదయం 10:30 వరకు 40.29 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ఉద‌యం 11 గంట‌ల స‌మ‌యంలో జిల్లాల వారిగా నమోదైన పోలింగ్‌ శాతాలు ఇలా ఉ‍న్నాయి. 

►శ్రీకాకుళం- 42.65 శాతం
►విజయనగరం- 50.7 శాతం‌
►విశాఖపట్నం- 43.35 శాతం 
►తూర్పు గోదావరి- 33.52 శాతం 
►పశ్చిమ గోదావరి- 32 శాతం‌
►కృష్ణా- 38.35 శాతం 
►గుంటూరు 45.90 శాతం
►ప్రకాశం 35.90 శాతం
►నెల్లూరు 42.16 శాతం
►చిత్తూరు 30.59 శాతం 
►వైఎస్ఆర్ కడప 31.73 శాతం
►కర్నూలు 48.72 శాతం0 
►అనంతపురం 48.15 శాతం  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top