స్పీక‌ర్‌కు రఘురామపై 290 పేజీల డాక్యుమెంట్ అంద‌జేత‌

 వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌

తూర్పుగోదావరి:  ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యవహారంపై లోక్‌సభ స్పీకర్‌  ఓం బిర్లాకు ఫిర్యాదు చేశామని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ, చీఫ్ విప్‌ మార్గాని భరత్ అన్నారు. రఘురామపై 290 పేజీల డాక్యుమెంట్‌ను స్పీకర్‌కు అందజేశామన్నారు. వారం రోజుల్లోనే రఘురామకు నోటీసులు వస్తాయని భావిస్తున్నామని తెలిపారు. స్పీకర్‌కు ఉన్న విచక్షణ అధికారాలతో వేటు వేస్తారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
  రఘురామ కృష్ణరాజు వైయ‌స్సార్‌సీపీ అధినేత, పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వెళ్తున్నారని విమర్శించారు. ఆయన పాల్పడుతున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. గతంలో జరిగిన శరద్ యాదవ్ ఘటన కూడా స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top