ఉనికి కాపాడుకునేందుకే చంద్రబాబు ‘కుప్పం’ డ్రామా

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే  తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
 

అనంతపురం:‘ఉనికి కాపాడుకునేందుకే కుప్పంలో చంద్రబాబు నాటకాలకు తెర లేపార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డి విమ‌ర్శించారు.  కుప్పంలో టీపీపీ కార్యకర్తల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండించారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి. కుప్పంలో చంద్రబాబు చేపట్టిన డ్రామా హాస్యాస్పదమన్నారు. రోజురోజుకూ చంద్రబాబు ప్రజాదరణ కోల్పోతున్నారని, ఉనికి కాపాడుకునేందుకే కుప్పంలో నాటకాలు ఆడారని ధ్వజమెత్తారు. రాప్తాడు నియోజకవర్గంలో మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయుల దౌర్జన్యాలు ధీటుగా ఎదుర్కొంటామన‍్నారు.

చెన్నేకొత్తపల్లి ఉప సర్పంచ్ రాజారెడ్డిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న వారిని అడ్డుకోవడంలో తప్పేంటి? పోలీసులను తిట్టడం పరిటాల కుటుంబానికి ఫ్యాషన్ అయిపోయింది. భద్రత కల్పిస్తున్న పోలీసులను దుర్భాషలాడటం పరిటాల సునీతకు తగునా? రాప్తాడు నియోజకవర్గంలో అలజడి సృష్టించేందుకు పరిటాల కుటుంబం కుట్ర’అని మండిపడ్డారు తోపుదుర్తి.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top