చంద్ర‌బాబు శ‌ని.. ఎన్టీఆర్‌ ఆనాడే అన్నారు!

మంత్రి రోజా
 

 తిరుమల: రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి పట్టిన శని చంద్రబాబు నాయుడే అని గతంలోనే ఎన్టీఆర్ చెప్పిన మాటలను గుర్తుచేశారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. శనివారం ఉదయం నియోజకవర్గ నేతలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి శని అని గతంలోనే స్వర్గీయ ఎన్టీఆర్ అన్నారు. ఆయన ప్రాణాలు తీసి.. నేడు వారి ఫొటోకి దండలు, దండం పెడుతున్నాడు. ఎన్టీఆర్ పేరు ఓ జిల్లాకి పెడితే.. కనీసం బాబు కృతజ్ఞత కూడా ప్రదర్శించలేదన్నారు ఆమె. మహానాడులో చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా.. సీఎం వైఎస్‌ జగన్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడని మంత్రి రోజా మండిపడ్డారు.

  మంత్రి విశ్వరూప్ ఇంటిపై జరిగిన దాడిని అమానుష చర్యగా అభివర్ణించిన ఆమె... అల్లర్లను అణచివేయడానికి పోలీసులు ఎంతో సమన్వయంగా వ్యవహరించారని మెచ్చుకున్నారు. అల్లర్లకు పాల్పడిన వాళ్లు ఎంతటి వాళ్లు అయినా వదిలేదేలే అని స్పష్టం చేశారు మంత్రి రోజా. 

ఎన్టీఆర్‌ మరణానికి కారణమైన వాళ్లే.. ఇప్పుడు ఫొటోకి దండం పెడుతున్నారని, మహానాడులో అయినా ఎన్టీఆర్‌కు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి అని మంత్రి రోజా డిమాండ్‌ చేశారు. 

మహానాడులో సీఎం జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు చంద్రబాబు. కానీ, సీఎం జగన్‌ పార్టీలకతీతంగా సంక్షేమ ఫలాలు అందజేస్తున్నారు. మా ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలూ లబ్ధి పొందుతున్నారు. 95 శాతం హామీలను సీఎం జగన్‌ అమలు చేశారు. 

అయితే మేనిఫెస్టోను వెబ్‌సైట్‌ నుంచి తీసేసిన ఘనుడు చంద్రబాబు అని ఆమె ఎద్దేశా చేశారు. ఫ్యాన్‌ గాలి(వైఎస్సార్‌సీపీని ఉద్దేశిస్తూ..) దెబ్బకు చంద్రబాబు, లోకేష్‌ పిచ్చెక్కి తిరుగుతున్నారని అన్నారు. మంచి చేశాం కాబట్టే.. ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నాం అన్న మంత్రి రోజా.. అంబేద్కర్‌ పేరు పెట్టాలని టీడీపీ, జనసేన ఎందుకు డిమాండ్‌ చేశాయని ప్రశ్నించారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top