మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమయాత్ర ప్రారంభం

గ్రామగ్రామాన రోడ్డుపై బారులు తీరి అశ్రునయనాలతో నివాళులు

మేకపాటి ఇంజనీరింగ్‌ కాలేజీ ఆవరణలో ఉదయం 11.30 గంటలకు అంత్యక్రియలు 

నెల్లూరు:  మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి అంతిమ యాత్ర నెల్లూరులోని మేకపాటి నివాసం నుంచి ఉదయం 6 గంటలకు  ప్రారంభమైంది. జొన్నవాడ మీదుగా బుచ్చి, సంగం, నెల్లూరుపాళెం, మర్రిపాడు, బద్వేలు సరిహద్దు జాతీయ రహదారి నుంచి బ్రాహ్మణపల్లి, కృష్ణాపురం, నందిపాడు మీదుగా ఉదయగిరికి చేరుకుంటుంది. ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీ (మెరిట్స్‌) ఆవరణలో ఉదయం 11.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. గంధపు చెక్కలతో మంత్రి పార్ధివదేహాన్ని దహనం చేస్తారు. తడిచిన గుండెతో, తడారని కళ్లతో దివంగత మంత్రి మేకపాటి కుటుంబ సభ్యులు, కుటుంబ సమానమైన అభిమానులు  వీడ్కోలు పలుకుతోన్నారు.  మేకపాటి భౌతికకాయానికి జనసంద్రం మధ్య జరుగుతున్న అంతిమయాత్ర సాగుతోంది. అంతిమయాత్రలో మంత్రులు ,ఎమ్మెల్యేలు,ఎంపీలు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. మీడియాతో పాటు  ఓపెన్ టాప్ ఎక్కి అంతిమ యాత్రలో మంత్రి పేర్ని నాని పాల్గొన్నారు. వందలాది వాహనాలతో మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమయాత్ర భారీగా కొనసాగుతోంది.  

తాజా ఫోటోలు

Back to Top