చట్టం ముందు అందరూ సమానమే 

మంత్రి అవంతి శ్రీనివాస్ 
 

 విశాఖపట్నం: చట్టం ముందు అందరూ సమానమేనని, అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి అవంతి శ్రీనివాస్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక, మద్యం విషయంలో అడ్డగోలుగా అవినీతి చేశారని పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో ఎలాంటి వివక్షత ఉండదన్నారు. భీమిలిలోని జరిగిన భూ కంభకోణాన్ని ఆధారాలతో సహా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఇచ్చామన్నారు. ఆయన దీనిపై ‘సిట్‌’ విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. దేవాలయాల విషయంలో టీడీపీ రాజకీయం చేస్తోందని, గో సంరక్షణే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. 
 
 

Back to Top