టీడీపీ నిర్వాకాలను ప్రజలు మరిచిపోలేదు   

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
 

ప్రకాశం జిల్లా: టీడీపీ పాలనలో దళితులు, బీసీలకు చేసిన నిర్వాకాలను ప్రజలు మరిచిపోలేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.   సీఎం వైయస్ జ‌గ‌న్ పాల‌న‌లో  పేదలకు మేలు జరుగుతుంటే టీడీపీ నాయకులు ఓర్వలేనితనంతో అసత్య ప్రచారాలకు దిగుతున్నారని  ధ్వజమెత్తారు. ‘‘ప్రజల్లో నాడు - ప్రజల కోసం నేడు’’ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘‘దళితులుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అన్న చంద్రబాబు మాటలు ప్రజలు మరిచిపోలేదు. నాయి బ్రాహ్మణులు మీ వద్దకు వచ్చి మాట్లాడుతుంటే మీకు ఎంత ధైర్యం.. మీ తోకలు కత్తిరిస్తా అన్న మాటలు గుర్తుకులేదా..? అని చంద్ర‌బాబును నిల‌దీశారు. మీ హయాంలో మంత్రి వర్గ సహచరులు కూడా దళితులపై ఏ విధంగా నోరు పారేసుకున్నారో ప్రజలకు తెలీదా? మీరా దళితులు, బీసీలు గురించి మాట్లాడేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  ఇప్పుడు భూ అక్రమాలు అని మా పార్టీ నాయకులపై లేనిపోనీ అభాండాలు వేస్తున్నారు. భూములను ఆక్రమించి రికార్డుల్లోకి చేర్చి , అక్రమాలకు పాల్పడింది మీ హయాంలో కదా?  మా హయాంలో అన్యాయంగా ఒక్క ఎకరా కూడా ఆన్లైన్ చేసిన దాఖలా లేదని అన్నారు.  అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామ‌ని,  దాన్ని చూసి తట్టుకోలేకే చంద్రబాబు, టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మంత్రి ఆదిమూలపు  సురేష్‌ దుయ్యబట్టారు

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top