3 రాజధానులపైన సుప్రీం కోర్టుకు ఏపీ ప్రభుత్వం

అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేసే అంశంపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.  రాజధానిగా అమరావతి ఉండాలంటూ  హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. అమరావతే రాజధానిగా ఉండాలంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడం  శాసన వ్యవస్థ అధికారాలను ఉల్లంఘించడమే అంటూ పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
 

Back to Top