తాడేపల్లి: రెండు నెలల పాటు హైదరాబాద్‌లో కోట్లాది రూపాయలతో నిర్మించుకున్న∙ఇంధ్రభవనంలో విశ్రాంతి తీసుకున్న చంద్రబాబు రాష్ట్రంలోకి అడుగుపెట్టి.. అడుగడుగునా లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని, నిబంధనలు ఉల్లంఘించిన చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టాలని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలోకి రాగానే తన కార్యకర్తలతో చంద్రబాబు పూలు చల్లించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ నేతలు భౌతిక దూరం పాటించలేదు.. మాస్క్‌లు కూడా ధరించలేదన్నారు. రెండు నెలలు హైదరాబాద్‌లో ఉండి జూమ్ యాప్ ద్వారా ప్రభుత్వంపై చంద్రబాబు బురదజల్లాడని మండిపడ్డారు. కరకట్టకు రోడ్డు మార్గాన వచ్చిన చంద్రబాబు వైజాగ్‌కు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలన బ్రహ్మాండంగా ఉందంటూ దేశ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. చంద్రబాబుకు, టీడీపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే సీఎం వైయస్ జగన్ ఏడాది పాలనపై బహిరంగ చర్చకు రావాలి. ఎల్‌జీ పాలిమర్స్ ఘటన విషయంలో సీఎం వైయస్ జగన్ తీసుకున్న చర్యలు, ప్రభుత్వం వేగంగా స్పందించిన తీరు, సహాయక కార్యక్రమాలను దేశం మొత్తం ప్రశంసించింది.హైదరాబాద్‌లో ఉండి జూమ్ యాప్ ద్వారా ప్రభుత్వంపై చంద్రబాబు బురద జల్లారు. ఇప్పుడు వైజాగ్ వెళ్లి ఏం చేస్తారు. ఆయన హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖ వెళ్లవచ్చుకదా? కరకట్ట ఇంటికి ఎందుకు వచ్చారు. తాను విశాఖ వెళ్తుంటే ఎయిర్‌పోర్టులు మూసివేశారని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన జయంతి వేడుకలు ఎలా నిర్వహిస్తారు. మహానాడు పెద్ద డ్రామా, ఎన్టీఆర్ ఆత్మ ఇప్పటికీ క్షోభిస్తుంది. కళా వెంకట్రావ్ లేఖలు రాయడం కాదు.. ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. చంద్రబాబు మొదట పెట్టిన ఐదు సంతకాలకు దిక్కులేదు. ఐదేళ్ల పాటు ప్రజలను అడుగడుగునా మోసం చేస్తూ చంద్రబాబు పాలన సాగింది. అందుకే 2019 ఎన్నికల్లో ఓడించి తగిన గుణపాఠం చెప్పారు. అట్టడుగు వర్గాలకు కూడా లబ్ధి చేకూరేలా ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలన సాగుతోంది. మా ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందనే చంద్రబాబు అడుగడుగునా కుట్ర రాజకీయాలతో అడ్డుతగులుతున్నాడు. అధికారంలోకి రాగానే బెల్టుషాపులు రద్దు చేశారు. ఇచ్చిన హామీలనే కాదు.. ఇవ్వని హామీలను కూడా మా ప్రభుత్వం అమలు చేస్తోంది. ఓ వ్యక్తి తప్పతాగి ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే డిబేట్లు పెడుతుంది.. టీడీపీ నేతలు రాజకీయం కోసం దేవుడిని కూడా వదలడం లేదు. పోతిరెడ్డిపాడు నేనే కట్టానని చంద్రబాబు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. టీడీపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే సీఎం వైయస్ జగన్ పాలనపై, ఇచ్చిన హామీలపైనా బహిరంగ చర్చకు సిద్ధమా’ అని చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి సవాల్ విసిరారు.