చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్‌పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్‌లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ముస్లిం మైనారిటీలకు శుభవార్త
11 Nov 2020 10:48 AM
ఇమామ్, మౌజిస్‌లకు గౌరవ వేతనం విడుదల
విజయవాడ: రాష్ట్ర ముస్లీం మైనారిటీలకు శుభవార్త. రాష్ట్రంలోని ఇమామ్, మౌజిస్‌లకు ఏపీ ప్రభుత్వం గౌరవ వేతనం విడుదల చేసినట్లు వక్ఫ్ బోర్డు సీఈఓ అలీం బాషా మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుమారు 23 కోట్ల రూపాయలకు పైగా నిధులను రెండు రోజులుగా ఆయా వక్ఫ్ సంస్థల అకౌంట్లలో జమ చేసినట్లు తెలిపారు. ఇమాంలకు రూ. 5 వేలు, మౌజిస్‌లకు రూ. 3వేల చొప్పున విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలోని 10వేల మంది లబ్దిదారులకు నిధులు విడుదల చేశామన్నారు. అలాగే గత ఏడాదిలో కూడా వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొత్తం 49.6 కోట్ల గౌరవ వేతనం అందించినట్లు అలీం బాషా తెలిపారు.