మద్యం నిషేధం దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం

మొత్తం 33 శాతం మద్యం షాపులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ

సచివాలయం: మద్యపాన నిషేధం దిశగా సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్‌ ముందుకెళ్తోంది. దశలవారి మద్య నిషేధంలో భాగంగా ప్రభుత్వం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వైన్‌ షాపులు తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 33 శాతం మద్యం షాపులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 4,380 మద్యం షాపులకు గానూ 2,934కు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనే 20 శాతం మద్యం దుకాణాలను తొలగించిన ప్రభుత్వం మరో 13 శాతం షాపులను తొలగిస్తున్నట్లు తాజాగా విడుదల చేసిన ఉత్తర్వులో పేర్కొంది. ఈ నెలాఖరుకు షాపులు తొలగించాలని ఆదేశాలు సైతం జారీ చేసింది.

రాష్ట్రంలో ఉన్న 43 వేల బెల్ట్‌షాపులపై వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అదే విధంగా 40 శాతం బార్లను తగ్గిస్తూ గతంలోనే నిర్ణయం తీసుకుంది. పేదవాడికి మద్యం దూరం చేయాలని, కుటుంబాల్లో సంతోషం నింపాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ దశలవారి మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నారు.

Back to Top