కళాశాలకు వెళ్లేందుకు తల్లిదండ్రుల అంగీకారం త‌ప్ప‌నిస‌రి

అన్‌లాక్ 4.0 ‌ మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ ప్ర‌భుత్వం

 అమరావతి: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసింది. ఈ నెల 30 వరకు విద్యాసంస్థల బంద్‌ కానున్నాయి. సెప్టెంబర్ 21 నుండి తొమ్మిదో తరగతి, టెన్త్‌, ఇంటర్ విద్యార్థులు పాఠశాలలు, కళాశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వగా, ఇందుకు తల్లిదండ్రుల రాత పూర్వక అంగీకారం తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్లకు 21 నుండి అనుమతి ఇచ్చారు. పీహెచ్‌డీ, పీజీ విద్యార్థులకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.  

►సెప్టెంబర్ 20 నుంచి పెళ్లిల​కు 50 మంది అతిథులతో అనుమతి
►అంతక్రియలకు 20 మందికి అనుమతి
►సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్,  ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్క్‌లకు అనుమతి నిరాకరణ
►సెప్టెంబర్ 21 నుండి ఓపెన్ ఏర్ థియేటర్స్ కు అనుమతి 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top