అఫ్ఘాన్‌లో చిక్కుకున్న తెలుగువారి కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్‌

 అమరావతి: అఫ్గానిస్తాన్‌ లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారి కోసం కార్మికశాఖలో ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌ను ఏపీ సర్కార్‌ ఏర్పాటు చేసింది. అఫ్ఘాన్‌లో చిక్కుకున్న తెలుగు వారు 0866-2436314, 7780339884, 9492555089 హెల్ప్‌ డెస్క్‌ నంబర్లకు  ఫోన్‌ చేసి వివరాలను తెలుపవచ్చని కార్మిక శాఖ పేర్కొంది.

 
అఫ్ఘనిస్తాన్లో చిక్కుకున్న భారతీయులు, అఫ్గానీల కోసం భారత ప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. అవసరమైన వారు ఈ నెంబర్లకు సంప్రదించడం ద్వారా భారత ప్రభుత్వం నుంచి సహాయం పొందవచ్చు. ఇప్పటికే ఆఫ్గనీలకు ప్రత్యేక వీసాలను జారీ చేసేందుకు కేంద్రం అంగీకరించింది. 

వాట్సాప్: +91 8010611290 ; +91 9599321199 ; +91 7042049944

ఫోన్: +91 11 4901 6783 ; +91 11 4901 6784 ; +91 11 49016785

ఇ-మెయిల్: SituationRoom@mea.gov.in

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top