వెనుకబడిన తరగతులు..ముంద‌డుగు

బీసీలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

బీసీ కార్పొరేషన్లకు 18న చైర్మన్లు, డైరెక్టర్లు 

56 బీసీ కార్పొరేషన్లకు నియామకాలు

సగం మహిళలకు దక్కేలా చర్యలు

139 కులాలకు ప్రాతినిథ్యం

ఇన్ని కార్పొరేషన్లు చరిత్రలో ఇదే తొలిసారి

అమరావతి: దేశ చరిత్రలోనే తొలిసారిగా వెనుకబడిన తరగతులకు చెందిన 139 కులాల సంక్షేమం కోసం  56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వీటికి చైర్మన్లు, డైరెక్టర్లను నియమించి చిత్తశుద్ధి చాటుకునేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకంలోనూ బీసీలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. బీసీ కులాల జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. పది లక్షలకు పైన జనాభా ఉన్న కార్పొరేషన్‌లను ‘ఏ’ కేటగిరీ కింద, లక్ష నుంచి పది లక్షల వరకు జనాభా ఉన్న కార్పొరేషన్‌లను ‘బి’ కేటగిరీ కింద, లక్షలోపు జనాభా ఉన్న కార్పొరేషన్‌లను ‘సి’ కేటగిరీ కింద విభజించారు.   

18న చైర్మన్లు, డైరెక్టర్ల నియామకం 
బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్ల నియామకాలకు అక్టోబరు 18వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. ఒక్కో కార్పొరేషన్‌కు 13 మంది డైరెక్టర్లను నియమించి అన్ని జిల్లాలకు ప్రాతినిథ్యం కల్పించనున్నారు. బీసీ కార్పొరేషన్ల ద్వారా 728 మంది డైరెక్టర్లుగా పదవులు పొందనున్నారు. ఇందులో 50 శాతం పదవులు మహిళలకు దక్కేలా చర్యలు చేపట్టారు. 

2.71 కోట్ల మందికి లబ్ధి 
వైయ‌స్సార్‌సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన 16 నెలల వ్యవధిలోనే 2,71,37,253 మంది బీసీలకు రూ. 33,500 కోట్ల మేర లబ్ధి చేకూర్చింది. ఇంత భారీగా బీసీల కోసం ఖర్చు చేసిన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు లేదు. బీసీలకు నామినేటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ పోస్టుల్లో సగం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా వైయ‌స్సార్‌సీపీ ప్రభుత్వానికే దక్కుతుంది.

తాజా వీడియోలు

Back to Top