పెయిడ్‌ ఆర్టిస్ట్‌ల వెనుక ఉన్నదెవరో తేల్చండి

ఏపీ ప్రభుత్వ చీఫ్‌ డిజిటల్‌ డైరెక్టర్‌ దేవేంద్రరెడ్డి గుర్రంపాటి

అమరావతి:  తప్పుడు కథనాలు, సన్నివేశాలతో తప్పుడు సమాచారం ఇస్తున్న పెయిడ్‌ ఆర్టిస్టుల వెనుక ఎవరున్నారో తేల్చాలని ఏపీ ప్రభుత్వ చీఫ్‌ డిజిటల్‌ డైరెక్టర్‌ దేవేంద్రరెడ్డి గుర్రంపాటి డీజీపీని కోరారు. టీడీపీకి చెందిన జూనియర్‌ పెయిడ్‌ ఆర్టిస్ట్‌ల విషయంపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను దేవేందర్‌రెడ్డి కలిశారు. సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి అసభ్యంగా మాట్లాడుతూ.. మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ కులాన్ని దూషించిన కుడితిపూడి శేఖర్‌చౌదరి చేసిన వీడియోపై ఫిర్యాదు చేశారు. మరో 3 రోజుల్లో పెయిడ్‌ ఆర్టిస్టును అరెస్ట్‌ చేసి దీనికి వెనుక ఎవరున్నారో వివరాలన్నీ బయటకు తీస్తామని డీజీపీ అన్నారు.

శేఖర్‌చౌదరిపై మరో ఫిర్యాదు 
సీఎం వైయస్‌ జగన్, అనిల్‌కుమార్‌యాదవ్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన శేఖర్‌చౌదరిపై వైయస్‌ఆర్‌సీపీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన వెంట లీగల్‌ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు తదితరులున్నారు.

Back to Top