ఐటీ స‌ల‌హాదారుగా కే. రాజ‌శేఖ‌ర‌రెడ్డి

ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

అమరావతి : రాష్ట్ర ప్రభుత్వానికి ఐటీ సలహాదారులుగా ముగ్గురు నిపుణుల్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జె. విద్యాసాగర్‌ రెడ్డి, శ్రీనాథ్‌ దేవిరెడ్డిలను ఐటీ సాంకేతిక సలహాదారులుగా నియమించగా.. కె. రాజశేఖర్‌ రెడ్డిని ఐటీ పెట్టుబడులు, పాలసీదారులుగా నియమించారు. ఈ మేరకు ఐటీ ముఖ్య కార్యదర్శి అనూప్‌ సింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రాజశేఖ‌ర‌రెడ్డి ఎంపిక ప‌ట్ల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోష‌ల్ మీడియా స‌భ్యులు, నేటిజ‌న్లు, సోష‌ల్ మీడియా వాలంటీర్లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

Back to Top