వరద బాధితులకు డిప్యూటీ సీఎంల భరోసా

ఏజెన్సీ గ్రామాల్లో పర్యటించిన మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ఆళ్లనాని
 

పశ్చిమ గోదావరి: వరద బాధితులకు రాష్ట్ర డిప్యూటీ సీఎంలు పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ఆళ్లనాని భరోసా కల్పించారు. ఈ మేరకు వరద ప్రభావిత ఏజెన్సీ గ్రామాల్లో శుక్రవారం మంత్రులు పర్యటించి వరద సహాయక చర్యలను పరిశీలించారు. ఏ  ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు ధైర్యం చెప్పారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే వరద ప్రభావిత గ్రామాల్లో 3 నెలలకు సరిపడ నిత్యావసరాలను అధికారులు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షపాతం నమోదు అయ్యింది. పెదవేగిలో అత్యధికంగా 108.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. జిల్లా వ్యాప్తంగా 919 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లింది. 223 హెక్టార్లలో నారుమళ్లు పూర్తిగా నీట మునిగాయి. భారీ వర్షాల కారణంగా ఇసుక ర్యాంపులు మూతపడ్డాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏజెన్సీ గ్రామాలను డిప్యూటీ సీఎంలు పిల్లి సుభాస్‌ చంద్రబోస్, ఆళ్లనానిలు సందర్శించారు. వరద బాధితులకు మంత్రులు భరోసా కల్పించారు. వరద గ్రామాల్లో వైద్య శిబిరాలు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రులు చెప్పారు.  వైద్యులు, పోలీసులు, రెవెన్యూశాఖ అధికారులు అన్ని గ్రామాల్లో అందుబాటులో ఉంచామని తెలిపారు.  
 

Back to Top