సీఎం వైయస్‌ జగన్‌కు డీజీపీ కృతజ్ఞతలు

 తాడేపల్లి: లాక్‌డౌన్‌లో విధులు నిర్వర్తిస్తూ కరోనా తో మృతి చెందిన పరిగి ఏఎస్ఐ కుటుంబానికి 50 లక్షల రూపాయల సాయం చేసిన సీఎం వైయస్‌ జగన్ కు డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీకి విదేశాల నుంచి 28000 మంది, ఢిల్లీ జమాత్‌ నుంచి 1185 మంది వచ్చారు ..వారందరిని క్వారంటైన్‌లో ఉంచామని డీజీపీ తెలిపారు. దేశంలోనే అత్యధిక మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న ఘనత ఏపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కరోనాపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు తగవని హితవు పలికారు.

తాజా వీడియోలు

Back to Top