వ్యాక్సిన్‌ నిల్వలను ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ ప్రోగ్రామ్‌కు కేటాయించాలి 

  ప్రధాని మోదీకి సీఎం వైయ‌స్‌ జగన్‌ లేఖ
 

తాడేప‌ల్లి: ప్రైవేట్‌ ఆస్పత్రులు తీసుకోనటువంటి వ్యాక్సిన్‌ నిల్వలను ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ ప్రోగ్రామ్‌కు కేటాయించాలని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి సీఎం వైయ‌స్ జగన్‌ విజ్ఞప్తి చేశారు. మంగ‌ళ‌వారం   ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. ప్రైవేట్‌ ఆస్పత్రులకు కేటాయించిన వ్యాక్సిన్లు పూర్తిగా వినియోగించబడలేదని.. ఈ వ్యాక్సిన్లను ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ ప్రోగ్రామ్‌కు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం పాలసీ ప్రకారం 25 శాతం వ్యాక్సిన్లను ప్రైవేట్‌ ఆస్పత్రులకు కేటాయించారని.. ఇందులో చాలా వ్యాక్సిన్లు మిగిలిపోయాయని సీఎం లేఖలో పేర్కొన్నారు.

జులై నెలలో ప్రైవేట్‌ ఆస్పత్రులకు 17,71,580 డోసులు కేటాయించారు. ఇంత పెద్ద మొత్తంలో వ్యాక్సిన్లను ప్రైవేట్‌ ఆస్పత్రులు వినియోగించుకునే అవకాశం లేదు.ఈనెల 24న జరిగిన ప్రధాన కార్యదర్శుల సమావేశంలోనూ, ఇతర రాష్ట్రాలు ఇదే అంశాన్ని ప్రస్తావించాయని లేఖలో సీఎం వైయ‌స్‌ జగన్‌ పేర్కొన్నారు.

Back to Top