మన టాయిలెట్స్‌లాగే బడిలోనివీ శుభ్రంగా ఉండాలి.. 

సీఎం వైయ‌స్ జగన్‌ ట్వీట్‌
 

తాడేప‌ల్లి:  ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం, పరిశుభ్రమైన టాయిలెట్స్‌ కల్పించాలన్న ప్రభుత్వ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్న అధికారులను అభినందిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి   ట్వీట్‌ చేశారు. విద్యార్థులతో కలిసి అధికారులు భోజనం చేస్తున్న, అధికారులే స్వయంగా మరుగుదొడ్లను శుభ్రం చేస్తున్న ఫొటోలను ఈ ట్వీట్‌కు సీఎం జతచేశారు.

‘ఇటీవల విద్యాశాఖ సమీక్షలో నేను ఇచ్చిన పిలుపు మేరకు పాఠశాలల్లో నాణ్యమైన వసతుల కల్పనకు అధికారులు తీసుకుంటున్న చొరవ అభినందనీయం. ఇంట్లో మనం తినే భోజనం ఎంత నాణ్యంగా ఉండాలనుకుంటామో అంతే నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించేందుకు అధికారులు సైతం అంతే తపనపడుతున్నారు. మనం ఉండే ఇంటి పరిసరాలు, టాయిలెట్‌ పరిశుభ్రంగా ఉండాలని మనం ఆశించినట్లుగానే బడిలో టాయిలెట్స్‌ కూడా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. ఈ సంకల్పాన్ని అధికారులు ముందుకు తీసుకెళ్తున్న తీరు స్ఫూర్తిదాయకంగా ఉంది’ అంటూ సీఎం తన ట్వీట్‌లో పేర్కొన్నారు.  

Back to Top