చదువుకోవడం పిల్లల హక్కు

సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

పద్ధతి ప్రకారం ప్రభుత్వ స్కూళ్లను నీరుగారుస్తూ వచ్చారు

విద్యా సంస్థలు లాభాపేక్షతో నడపరాదు

 పాఠశాల విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్‌ బిల్లుకు సభ ఆమోదం

 

అమరావతి: చదువుకోవడం పిల్లల హక్కు అని, పేదరికం నుంచి బయటపడేసే ఆయుధం చదువేనని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. పాఠశాల విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్‌ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ రోజు తీసుకువచ్చే ఈ చట్టం ఏపీ స్కూల్‌ ఎడ్యూకేషన్‌ రెగ్యులేటరీ మ్యానిటరింగ్‌ బిల్లు ఒక చారిత్రాత్మక ఘట్టం. కారణం ఏంటంటే ..గత ఐదేళ్లు మనం చూస్తున్నాం. మన కళ్లెదుటే ప్రైవేట్‌ స్కూల్స్‌ ఏరకంగా ఫీజుల పేరుతో బాదుతున్నా ఎవరు అడగలేని పరిస్థితి. సాక్షాత్తు ఆ స్కూళ్ల యాజమాన్యాలే ఇక్కడ మంత్రులుగా ఉన్నారు. పెద్ద పెద్ద వాళ్లే మంత్రులుగా ఉంటే ..ఫీజుల నియంత్రణ ఎక్కడ ఉంటుంది.  ఏపీలో పరిస్థితి ఏంటంటే ..ప్రతి ప్రైవేట్‌ స్కూల్‌లోనే 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాలి. చాలా తక్కువ అమౌంట్‌కు చార్జ్‌ చేయాలి. ఆ మిగతా ఫీజు ప్రభుత్వం చెల్లించాలి. రైట్‌ టు యాక్ట్‌ ఎడ్యుకేషన్‌ ఎక్కడా అమలు కాలేదు. ఇష్టానుసారంగా ఫీజులు పెంచారు. పద్ధతి ప్రకారం ప్రభుత్వ స్కూళ్లను నీరుగార్చారు. మధ్యాహ్న భోజన పథకం బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో పెట్టారు. జూన్‌లో ఇవ్వాల్సిన పుస్తకాలు సెప్టెంబర్‌ వచ్చినా ఇవ్వలేదు. ప్రభుత్వ స్కూళ్లను రేషనలైజేషన్‌ పద్ధతిలో మూత వేయించారు. విద్యావ్యవస్థలో సమూల మార్పలు తీసుకువచ్చే దిశగా పేద, మధ్య తరగతి వారికి చదువు అన్నది ఒక హక్కుగా ఇవ్వాలన్నారు. దేశంలో నిరాక్షరాస్యత 26 శాతం ఉంటే..ఏపీలో 33 శాతం ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఈ బిల్లును తీసుకువస్తున్నాం. ఈ కమిషన్‌కు చైర్మన్, వైస్‌ చైర్మన్‌తో పాటు 11 మంది కమిటీ సభ్యులుగా ఉంటారని, వీరు స్కూళ్లకు వెళ్లి అడ్మిషన్లు, ఫీజుల వసూలు వంటి మానిటరింగ్‌ ప్రక్రియను చేపట్టవచ్చు అన్నారు. రైట్‌ టు ఎడ్యుకేషన్, అక్రిడేషన్‌ వంటివి ఈ కమిషన్‌ పరిధిలోని తీసుకువస్తామన్నారు. కమిషన్‌ చెప్పిన మాట వినకపోతే హెచ్చరిస్తారని, ఫెనాల్టీ వేస్తారని, అప్పటికీ వినకపోతే చివరకు స్కూళ్లను క్లోజ్‌ చేసే అధికారాలు ఈ కమిషన్‌కు ఉంటాయని వివరించారు. ప్రతి పేదవాడికి చదువును దగ్గర చేసేందుకు ఈ కమిషన్‌ తీసుకువస్తున్నామని సీఎం వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు.
 

Back to Top