మంచి ఇంజినీర్లుగా తీర్చిదిద్దాలన్నదే నాన్నగారి కోరిక

ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులతో సీఎం వైయస్‌ జగన్‌ ముఖాముఖి

మంచి ఉద్దేశంతో వైయస్‌ఆర్‌ ట్రిపుల్‌ ఐటీని స్థాపించారు

గత ప్రభుత్వం ట్రిపుల్‌ ఐటీలపై శ్రద్ధ చూపలేదు

రూ.185 కోట్ల నిధులు గత ప్రభుత్వం పక్కదారి పట్టించింది

ఇకపై ట్రిపుల్‌ ఐటీల పరిస్థితిని మారుస్తాం

శ్రీకాకుళం:  గ్రామీణ ప్రాంతాల్లో బాగా చదువుకునే పిల్లలను మంచి ఇంజినీర్లుగా తీర్చిదిద్దాలన్నదే నాన్నగారి కోరిక అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఎస్‌ఎం.పురంలోని ట్రిపుల్‌ ఐటీ కాలేజీలో ముఖ్యమంత్రి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ట్రిపుల్‌ ఐటీలోని సమస్యల గురించి పూర్తి అవగాహనతో ప్రభుత్వం ఉంది. ఇదే జిల్లాలోనే నాలుగో సంవత్సరం . ఇక్కడ నాలుగు వేల మంది ఇక్కడ చదువుతూ ఉండాలి. ఇక్కడ 1500 మంది మాత్రమే ఇక్కడ చదువుతున్నారని పెద్దలు చెబుతున్నారు. నూజివీడులో 2 వేల మంది చదువుతున్నారు. భవనాలు చాలా పూర్తి కావాలి. ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలి. సిబ్బందిని నియమించాల్సి ఉందని ఇక్కడి నేతలు చెప్పారు. ఇక్కడి సమస్యలు అన్ని నాకు తెలుసు. కేశవరెడ్డి ట్రిపుల్‌ ఐటీలో అనుభవం ఉన్న వ్యక్తి. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన్ను పిలిచి ట్రిపుల్‌ ఐటీల గురించి వివరాలు తెలుసుకున్నాను. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అకాల మరణంతో కాలేజీలపై తరువాతి ప్రభుత్వాలు సరైన శ్రద్ధ కనబరచలేదు. నాన్నగారు ఆలోచన చేసిన వెంటనే పులివెందుల, నూజీవీడులో ట్రిపుల్‌ ఐటీలు ఏర్పాటు చేశారు. ఐదేళ్లలో ఈ కాలేజీలను పట్టించుకోలేదు. రూ.185 కోట్ల నిధులు పక్కదారి పట్టించారు. ఆ పరిస్థితిని మార్చేందుకు కేశవరెడ్డిని ఇక్కడ నియమించాం. వంద రోజుల్లోనే తాను కూడా ఇక్కడికి వచ్చాను. మీకు భరోసా కల్పించేందుకు ఇక్కడి వచ్చాను. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే నేను వింటా..

దేశం మొత్తం మన వైపు చూసేలా చేస్తాం
రాష్ట్రం విడిపోయేసమయానికి రాష్ట్రానికి ఎటువంటి ఇన్‌ఫ్రాక్ట్రచర్‌ లేదు. మనం ఐటీని వదిలి రావాల్సి వచ్చింది. మనకు టైర్‌ వన్‌ సిటీలు లేవు. మనకు ఒక్క విశాఖ మాత్రమే టైర్‌ వన్‌కు వెళ్లే అవకాశం ఉంది. ఆ దిశగా అడుగులు వేసే కార్యక్రమం చేస్తాం. ఐటీ రిక్వైర్‌మెంట్స్‌కు స్కిల్స్‌ ఇచ్చే ప్రదేశం ట్రిపుల్‌ ఐటీ మాత్రమే. నాన్న కలలు కన్న ట్రిపుల్‌ ఐటీగా మార్చుతాం. మండల స్థాయిలో పదిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. ఆరు ఏళ్ల పాటు గ్రామీణ విద్యార్థులకు ఇక్కడ ట్రైనింగ్‌ ఇస్తున్నాం. స్టాఫ్‌ నియమించాల్సి ఉంది. దేశం మొత్తం మన వైపు చూసేలా కచ్చితంగా చూస్తాం.

ట్రిపుల్‌ ఐటీని ఇంక్యూబేషన్‌ సెంటర్‌గా మార్చుతాం
మనం పరిశ్రమల్లో 75 శాతం స్థానికంగా ఉన్న వారికి ఉద్యోగాలు ఇవ్వాలని ఒక చట్టం తీసుకువచ్చాం. ఏ పరిశ్రమ కూడా ట్యాలెంట్‌ ఉందా అని అడుగుతుంది. ఆ ట్యాలెంట్‌ను పెంపొందించాల్సింది ప్రభుత్వమే. నాకు నమ్మకం ఉంది. వీళ్లను ప్రపర్‌గా ట్రైనింగ్‌ ఇస్తే ఈ పిల్లలు బ్రహ్మండంగా రాణిస్తారన్న నమ్మకం ఉంది. ప్రతి పార్లమెంట్‌ను ఒక యూనిట్‌గా తీసుకొని, ఓ కాలేజీలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తాం. లోకల్‌గా ఉన్న పరిశ్రమలకు అవసరమైన వారిని ట్రైనింగ్‌ ఇప్పిస్తాం.  మన పిల్లల క్వాలిఫికేషన్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తాం. ట్రిపుల్‌ ఐటీకి ప్రత్యేకంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తాం. ఇంక్యూబేషన్‌ సెంటర్లుగా మార్చుతాం.  ఇన్ఫోసిస్‌ సెంటర్లు కూడా ఇక్కడికి రప్పిస్తాం. 

ప్రతి ఏటా జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్‌
మనం వేసే ప్రతి అడుగు కూడా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడమే. కరెక్టుగా అడుగులు వేయగలిగితే ఈ సమస్యను తగ్గించగలుగుతాం. ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియట్‌ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఇంటి వద్దకు సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంగా గ్రామ వాలంటీర్లను ఏర్పాటు చేశాం. 50 ఇళ్లకు ఒక్కరిని నియమించి, నెలకు రూ.5 వేలు అందిస్తున్నాం. మూడేళ్ల కాలంలోనే 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగామని చెప్పడానికి గర్వపడుతున్నా. అన్నింటికన్న విప్లవాత్మక మార్పు ఏంటంటే ..స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు అన్న చట్టం తెచ్చాం. దేశంలో మనమే ఇలాంటి చట్టం చేశాం. చదువులు పూర్తి అయిన తరువాత పిల్లలు ఉద్యోగాల కోసం వలస వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితి మార్చేందుకు ప్రభుత్వం ఈ చట్టాన్ని చేసింది. ఇందులో సవాల్స్‌ కూడా ఉన్నాయి. మనకు ఉన్న స్కిల్స్‌ అప్‌గ్రేడ్‌ చేసుకోవాలి. మనం చదివే ప్రతి కోర్స్‌లు కూడా జాబ్‌ ఓరియేంటెడ్‌ కోర్స్‌గా ఉండాలన్నారు. రాబోయే రోజుల్లో ఈ సిఫార్సులు అన్ని కూడా ఇంఫ్లిమెంట్‌ అయ్యేలా చేస్తాం. క్వాలిటీ ఆఫ్‌ ఎండ్యుకేషన్‌ అందించే దిశగా అడుగులు వేస్తున్నాం. ఉద్యోగ అవకాశాలు మెరుగు అవుతాయన్న నమ్మకంతో ఉన్నాను. ప్రతి ఏటా జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్‌ విడుదల చేస్తాం. ఉద్యోగాల నియామకానికి శ్రీకారం చుడతాం.

మన ప్రభుత్వంలో ఎస్సీ మహిళా హోం మంత్రి
మనమంతా కూడా సిగ్గుపడాల్సిన కార్యక్రమం. దళిత, మహిళా ఎమ్మెల్యే శ్రీదేవి వినాయక చవితి వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తే కొంత మంది టీడీపీ నేతలు కొంత మంది మైల పడుతుందని అనడం బాధాకరం. ఆ రకంగా అనకూడదు. ఆ పార్టీ నేతలను దండించాల్సిన టీడీపీ అధ్యక్షుడు నోరు మెదపడం లేదు. మన ప్రభుత్వంలో హోం మంత్రి ఎస్సీ కులానికి చెందిన ఓ మహిళా అని గర్వంగా చెబుతాం. ఇటువంటివి ఎక్కడా కూడా పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం.

నాకు స్ఫూర్తి..రోల్‌ మాడల్‌ దివంగత నేత వైయస్‌ఆర్‌
నేను తిరిగినంతగా ఏ రాజకీయ నాయకుడు కూడా వెళ్లి ఉండడు. ఓదార్పుయాత్ర, పాదయాత్ర వంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా పేదల వద్దకు నేరుగా వెళ్లాను. పేదరికాన్ని దగ్గర నుంచి చూశాను. పేదరికం పోవాలంటే ఆ కుటుంబం నుంచి ఒక్కడైనా పెద్ద చదువులు చదవాలి. నా కళ్లతో జరిగేదంతా చూశాను. వ్యవస్థ పూర్తిగా మారాలి. 2011 లెక్కల ప్రకారం 33 శాతం మందికి మన రాష్ట్రంలో చదువు రావడం లేదు. దేశం కన్నా మనం అన్యాయంగా ఉన్నాం. చదివించాలన్న తపన ఉన్నా కూడా కడుపులో అన్నం పడితే దాని తరువాత వచ్చే ఆలోచన చదువు. ఈ పరిస్థితి మార్చాలన్న ఆలోచనతో ఈ 33 శాతాన్ని సున్నాకు తీసుకెళ్లాలి. ఆ తల్లికి అవగాహన కల్పించాలి. అందుకే అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టాం. పిల్లలను బడికి పంపిస్తే చాలు రూ.15 వేలు ఇస్తాం. 18 ఏళ్ల నుంచి 23 ఏళ్ల వరకు ఉన్న విద్యార్థులు ఎంతమంది కాలేజీల్లో చేరుతున్నారని లెక్కలేస్తే.. బ్రిక్స్‌ దేశాలతో మనం పోల్చుకుంటే రష్యాలో 81, చైనాలో 56, మన దేశంలో 20 శాతమే ఉంది. రష్యాను బీట్‌ చేయాలంటే వంద శాతం ఫీజు రీయింబర్స్ మెంట్‌ తీసుకురావాలి. బోర్డింగ్‌, లాడ్జింగ్‌ కోసం ఏడాదికి రూ.20 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. నాకు స్ఫూర్తి...రోల్‌  మాడల్‌ దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి మాత్రమే అని గర్వంగా చెబుతున్నా. రాబోయే రోజుల్లో ఈ కాలేజీలో మార్పు కనిపిస్తుంది. కాలేజీలను బ్రహ్మండంగా తీర్చిదిద్దుతానని మాటిస్తున్నాను.
 

Back to Top