న‌ర‌స‌రావుపేట బ‌య‌లుదేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

ప‌ల్నాడు :  వాలంటీర్ల స‌న్మాన కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యం నుంచి నరసరావుపేటకు  బయలుదేరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే ఏపీ వ్యాప్తంగా వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆరంభంలో దీనిపై తీవ్ర విమర్శలు చేసిన వారు సైతం.. ఇప్పుడు అభినందించేలా వలంటీర్లు అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యారు. అందుకే వాళ్ల సేవలకు ప్రోత్సాహకంగా ఇవాళ పల్నాడు నర్సరావుపేటలో నిర్వహించబోయే బహిరంగ సభలో సీఎం వైయ‌స్‌ జగన్‌ సత్కరించనున్నారు. వరుసగా రెండో ఏడాది గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు అవార్డులు ఇవ్వనుంది ఏపీ ప్రభుత్వం.  మొత్తం 2, 33, 333 మంది వలంటీర్లకు.. రూ.239.22 కోట్ల నగదు పురస్కారాలు అంద‌జేస్తారు. సీఎం వైయ‌స్ జగన్‌..సీఎం వెంట మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీరంగనాథరాజు ఉన్నారు.
 

Back to Top