గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేశాం

వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ట్వీట్‌
 

అమరావతి: గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేశామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు. గ్రామ స్వరాజ్యాన్ని సాధించేందుకు వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించామన్నారు. కనీస అవసరాల కోసం ప్రజలు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ బాధ్యత వహిస్తారని చెప్పారు. సంక్షేమ పథకాలను డోర్‌ డెలివరీ చేస్తామని సీఎం పేర్కొన్నారు. గ్రామసచివాలయంతో అనుసంధానం చేసుకుని మీ సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు.

తాజా ఫోటోలు

Back to Top