మున్సిపల్‌ స్టేడియంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం వైయ‌స్‌ జగన్‌

 విజయవాడ: దేశ 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆంధ్రప్రదేశ్‌లో  శనివారం ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ప్రత్యేక వాహనంపై కంటిజంట్స్‌ను సీఎం వైయ‌స్‌ జగన్‌ పరిశీలించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ సంక్షేమ పథకాల శకటాలను సీఎం వైయ‌స్‌ జగన్‌ వీక్షించారు.  సంక్షేమ పథకాలు ప్రతిధ్వనించేలా ఏర్పాటు చేసిన శకటాలతో పాటు  కరోనా కష్ట కాలంలో ఆరోగ్య సేవలకు గాను ఏర్పాటు చేసిన శకటాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top