ఈర్ష్యతో టీడీపీ అనవసర రాద్ధాంతం 

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఫైర్‌

మేనిఫెస్టోను అమలు చేయడమే మా లక్ష్యం

అమరావతి:  ప్రజలకు మంచి ఆలోచన చేయాలని టీడీపీకి లేదని, ఈర్ష్యతో రాద్ధాంతం చేస్తుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు ఒక అబద్ధాన్ని తీసుకొని టీడీపీ రాద్ధాంతం చేస్తోందని ధ్వజమెత్తారు.  ప్రజలు మా మేనిఫెస్టోను నమ్మే అధికారం ఇచ్చారన్నారు. మేనిఫెస్టోకు మనసా, వాచా కట్టుబడి ఉన్నామన్నారు. రబీలో రైతులను ఆదుకోవాలని అక్టోబర్‌లోనే పెట్టుబడిసాయం అందిస్తున్నామన్నారు. మేనిఫెస్టోను అమలు చేయడమే మా లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. సభ సజావుగా జరగాలి, చర్చ జరగాలనే ఆలోచన చంద్రబాబుకు లేదని విమర్శించారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఈర్ష్యతో టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని దుయ్యబట్టారు. 

 

తాజా ఫోటోలు

Back to Top